Social Icons

Tuesday, September 27, 2016

అభినవ వాసుదేవుడు

//అభినవ వాసుదేవుడు//

పొత్తిగుడ్డల్లో చుట్టిన బాలకృష్ణుడితో నదిని దాటిన వాసుదేవుడి కథ విన్నాం
మాతాపితృ సేవాపరాయణుడైన శ్రవణ కుమారుని కథా విన్నాం
పతి ప్రాణాల కోసం యముడితో తలపడిన సావిత్రి కథా విన్నాం
బిడ్డను బతికించుకోడానికి బాహుబలిలో శివగామి పడిన తపనా చూశాం
కన్నబిడ్డ కోసం కిడ్నీ దానం చేసిన తండ్రినీ కన్నాం...
కానీ....

Monday, September 26, 2016

‘ఆ 18 మంది’....

Posted: September 25, 2016

‘ఆ 18 మంది’....
ఆ ఉషోదయం వేళ దేశాన్ని కుదేపేసిన ఓ ఉగ్రదారుణం
హృదయాలను కలచివేసిన ఓ దుస్సంఘటనం
ప్రతీకారేచ్ఛతో రక్తం మరిగిపోయిన క్షణం
అది పాక్ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన రక్తపాతం

స్వరమాంత్రికుడు పిబి శ్రీనివాస్

Posted: September 22, 2016

//స్వరమాంత్రికుడు పిబి శ్రీనివాస్//
వాగ్గేయకారుడనే పదానికి స్వచ్ఛమైన ఉదాహరణ ఆయన..
తెలుగునాట పుట్టి... కన్నడిగులను మెప్పించి...
తమిళ, మలయాళ, హిందీ, ఉర్దూ భాషల్లోనూ రాణించి...
అశువుగా పద్యాలు.. పాటలు రాసి... అలవోకగా గజల్స్ పాడి...
సంగీతాభిమానుల మనసుదోచిన గాన గంధర్వుడు...

అమర జవానులారా... మీకు వందనం

Posted: September 20, 2016

//అమర జవానులారా... మీకు వందనం//
జోహార్ వీరులారా... అమర జవానులారా...
శత్రువు దొంగదెబ్బ తీసినా...
గుండులు గుండెను చీల్చినా...
రక్తం ఏరులై పారినా...

సంగీత సామ్రాజ్ఞికి శతజయంతి నివాళులు

Posted: September 17, 2016

//సంగీత సామ్రాజ్ఞికి శతజయంతి నివాళులు//
‘కౌసల్యా సుప్రజా రామా పూర్వసంధ్యా ప్రవర్తతే’ అంటూ..
దేవుళ్లకే మేలుకొలుపు పాడే సంగీత రాజ్ఞి...
ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లి...
సుప్రభాత గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మి...

మా పంతులు గారు

 Posted: September 13, 2016

//మా పంతులు గారు//
మా ఊరు...
జ్ఞాపకాల పొదరిల్లు... మమతల హరివిల్లు... అనురాగాల విరిజల్లు
అందుకే అంటారేమో... కన్నతల్లి... స్వంతఊరు ఒక్కటేనని.
అమ్మలోని అనురాగం... స్వంతఊరితోటి అనుబంధం
ఎప్పటికి మనలను ఒదిలిపెట్టవు.
వైఫైలా ఎప్పుడూ మన చుట్టూనే అల్లుకొని వుంటాయి.

సంగీత రస ఝరిలో ఓ సాయంత్రం

Posted: September 05, 2016

సంగీత రస ఝరిలో ఓ సాయంత్రం--------------------------------------------
మరో అందమైన సాయంత్రాన్ని అద్భుతంగా ఆస్వాదించిన రోజు (04-09-2016 ఆదివారం).
సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం(విజయవాడ) కర్నాటక సంగీత ఝరిలో ఓలలాడింది.
సంగీతప్రియుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియం పరవశించింది.
బెంగళూరుకు చెందిన ప్రిన్స్ రామవర్మ నిర్వహించిన కర్నాటక గాత్ర సంగీత కచేరీ 

‘‘తస్మాత్ జాగ్రత్త’’ కథపై నా అభిప్రాయం

Posted : August 29, 2016

ఆదివారం ‘ఈనాడు’ సండే మ్యాగజైన్ లో వచ్చిన ‘‘తస్మాత్ జాగ్రత్త’’ కథ చాలా బాగుంది.
నాగేశ్వరరావు గారు రచించిన ఈ కథ.. హాస్యంతో పాటు ఒకింత సందేశాన్ని కూడా ఇస్తుంది.
సంప్రదాయం పేరుతో జరుగుతోన్న ఆచార వ్యవహారాలపై వ్యంగ్యోక్తులు విసురుతూ చక్కని హాస్యాన్నందించారు.
ఈ ఆధునిక యుగంలో చావులు, తద్దినాలు కూడా ఈవెంట్స్ గా మారిన నేపథ్యంలో...

కాస్త కిక్కుండాలబ్బా..

Posted: August 28, 2016

కాస్త కిక్కుండాలబ్బా..
-------------------
సినిమాలు చేస్తా..
రాజకీయాలు చేస్తా..
***
ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు
కొన్ని సూచనలు చేయదలచాను... వాటికి గుంజుకోవద్దు
***
మోడీ అంటే నాకు చాలా గౌరవం...
వ్యక్తిగతంగా ప్రధానితో మాట్లాడదల్చుకోలేదు...
***
ఈ డబుల్ స్టేట్మెంట్స్ ఏంటి తిరుమలేశా.. అంటే?
ఇది మాంచి కిక్కిచ్చే (గేమ్)షో..
ఆ మాత్రం లేకుంటే కిక్కేం ఉంటదబ్బా..

ఈయన దేవుడు కాదు... మనిషి..

Posted: August 27, 2016

ఆలిని...
అడవులకంపిన రాముడి గురించి విన్నాం
నడివీధిలో అమ్మేసిన హరిశ్చంద్రుడి గురించీ విన్నాం
.... అయినా వాళ్లు దేవుళ్ళు.
నాతిచరామి అని ప్రమాణం చేసి...
ఏడడుగులకు కొత్త అర్థం చెప్పి...

దర్శక శిఖరం... కైలాసం బాలచందర్

Posted: August 26, 2016
//దర్శక శిఖరం... కైలాసం బాలచందర్//
సినిమా అంటే కేవలం రెండుగంటల కాలక్షేపం కాదు..
పెద్దపెద్ద హీరోలు, ఆర్భాటపు సెట్టింగులు.. ఫైట్లు, డ్యూయెట్లు కాదు...
సమాజాన్ని విశ్లేషించాలి... సమాజ అంతరంగాన్ని దర్శించగలగాలి...
జీవితాన్ని ప్రతింబింబించాలి..

పేగుబంధం

Posted: August 23, 2016

నవమాసాలు మోసినప్పుడు
బుజ్జి బుజ్జి కాళ్లతో కడుపున తట్టినప్పుడు
ఆ అనుభూతిని ఏమని వర్ణించాలి
అందుకు ఏ భాషలోని అక్షరాలు సరిపోతాయి...

అద్భుతాలు చేస్తోన్న కార్యసాధకుడు

Posted: August 22, 2016

‘నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను..’
... ఈ అక్షరాలకు రూపమిచ్చిన ఆచార్యుడాయన

అభినందనలు రజత సింధూరమా...

Posted: August 20, 2016

అభినందనలు రజత సింధూరమా... 
వినువీధులలో భారతకీర్తిని రెపరెపలాడించిన
మువ్వన్నెల పతాకమా..
బాడ్మింటన్‌ చరిత్రలో రికార్డు సృష్టించావు

ఒలింపిక్స్ లో పెను సంచలనం

Posted: August 18, 2016

ఒలింపిక్స్ లో పెను సంచలనం
యావత్ భారత ప్రజల ఆశల పల్లకి పివి సింధు
ఒలింపిక్స్ ఫైనల్‌ చేరిన తొలి మహిళా షట్లర్‌ మన తెలుగు బిడ్డ
సెమీస్ విజయంతో భరతమాత నుదుట దిద్దె విజయసిందూరం 
వరుస సెట్లలో జపాన్‌ షట్లర్‌ ఒకుహరను కంగుతినిపించి
ప్రపంచ నెంబర్‌వన్‌ షట్లర్‌ మారిన్‌తో ఢీకొననున్న నీకు
130కోట్ల భారతీయుల ఆశలే అండదండలు...
నీ ఆటతీరుకు యావత్ భారతావని పులకించింది
తుదిపోరులోనూ పసిడి కాంతులతో భరతమాత నుదుట దిద్దాలి విజయతిలకం
నీకివే మా ఆశీస్సులూ.... అభినందనలు...

పంచభూతాలే ఆ తల్లికి మంత్రసానులు

Posted: August 16, 2016

//పంచభూతాలే ఆ తల్లికి మంత్రసానులు//
70ఏళ్ల మన స్వాతంత్ర్యం సిగ్గుతో తల వంచుకోవాలి
అక్కడ ప్రధాని, ఇక్కడ ముఖ్యమంత్రి
అభివృద్ధి గురించి గప్పాలుకొట్టి 24గంటలైనా గడవలేదు
నిర్వీర్యమౌతోన్న స్వాతంత్ర్య ఫలాలను
మరోసారి బట్టబయలు చేసిన హృదయవిదాకర ఘటన ఇది.

స్వాతంత్ర్యదినోత్సవం... భారతీయులందరికీ పెద్ద ఉత్సవం

Posted: August 15, 2016

స్వాతంత్ర్యదినోత్సవం... భారతీయులందరికీ పెద్ద ఉత్సవం
పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అని... చెప్పినట్టుగా
ఈ దేశం నాదని నినదించాం... బ్రిటిష్ పెత్తనాన్ని పారద్రోలాం..
ఆ ఔన్నత్యం.. ఉత్తేజం అందించిన భారతీయ వారసులం మనం...
69ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో సమస్యలు... సవాళ్లు

విశాఖలో నాల్గవ రోజు....

Posted: August 13, 2016

విశాఖలో నాల్గవ రోజు....
---------------------
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కనకమహాలక్ష్మీదేవీ అమ్మవారి ఆలయం
150 ఏళ్ల పైబడి సుధీర్ఘ చరిత్ర ఈ ఆలయం సొంతం
అమ్మవారికి త్రికాల సమయంలో పంచామృతాభిషేక సేవలు
శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు
మార్గశిర మాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలు 

విశాఖలో మూడో రోజు...

Posted: August 12, 2016

విశాఖలో మూడో రోజు...
------------------
మూడు ప్రాకారాలు...
అయిదు ద్వారాలు...
నాట్య, ఆస్థాన, భోగ మంటపాలు...
ప్రత్యేకతలుగా విలసిల్లుతోన్న ఆలయం.
ఆలయ స్తంభాలు శిల్పకళా శోభితాలు

విశాఖలో రెండో రోజు :

Posted : August 11, 2016

విశాఖలో రెండో రోజు :
-------------------------
అరసవల్లి సూర్యదేవాలయాన్ని సందర్శించాలన్న కోర్కె
కాసింత ఇబ్బంది పెట్టిన ఎండ వేడిమిని సైతం జయించింది.
ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న 
ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి.
శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో వుంది.

ముఖపుస్తక అనుబంధం... విరియాలి స్నేహ సుమగంధం

Posted: August 10, 2016

ముఖపుస్తక అనుబంధం
విరియాలి స్నేహ సుమగంధం
***
ఇప్పటికే అర్థమై వుంటుందనుకుంటా
ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానో...

గుడ్ మార్నింగ్ విశాఖపట్నం...

Posted : August 10, 2016
గుడ్ మార్నింగ్ విశాఖపట్నం...
------------------
విశాఖ అందాలను ఆస్వాదించడానికి
ఇప్పుడే గాల్లో ఎగిరొచ్చాను...
ఐదు రోజులపాటు సందడే సందడి..
విశాఖతో అనుబంధం కొత్త కాకపోయినా...
చాలా రోజుల తర్వాత
మళ్లీ విశాఖ రావడం సంతోషంగా వుంది.
బంధు మిత్రులతో ఆనందాన్ని పంచుకోడానికి
విశాఖ అందాలను తిలకించడానికి
ఇదొ సదవకాశం...
అందరికీ శుభోదయం..

సృష్టిలో తీయనిది స్నేహం...

Posted : August 7, 2016
‘స్నేహం అనేది రెండు దేహాల్లో ఉండే ఒకే ఆత్మ...’ అంటారు అరిస్టాటిల్...
స్నేహం గురించి ఎందరో ప్రముఖులు అనేక నిర్వచనాలు చెప్పారు.
సృష్టిలో తీయనిది 
అందమైనది 
అంతంలేనిది
అనునిత్యం తోడుగా వుండేది
స్నేహం...

బహుముఖ ప్రజ్ఞాశాలికి సరైన నిర్వచనం మా అక్క

posted: August 7, 2016
బహుముఖ ప్రజ్ఞాశాలికి సరైన నిర్వచనం మా అక్క భార్గవి
‘నీ గాన తేజస్సు లోకాల్ని వెలిగిస్తుంది
నీ సంగీత జీవ శ్వాస

ఆధునిక ‘‘పెళ్లిచూపులు’’ (సమీక్ష)

Posted:  August 2, 2016
పేరుకు తగ్గట్టుగానే మనసును గిలిగింతలు పెట్టే చక్కని ప్రేమకథా చిత్రం ‘పెళ్లి చూపులు’. నిజజీవితంలో పెళ్ళిచూపులు
కలిగించేలాంటి ఓ అనుభూతిని ఈ సినిమా కూడా అందిస్తుంది. ఈ సినిమా ఇతివృత్తం చాలా చిన్నది. ప్రేమ, కెరీర్, పెళ్లి
... ఈ మూడు అంశాలను తీసుకొని నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా చాలా సున్నితంగా... ఒక సుందర శిల్పాన్ని 
చెక్కినంత ఏకాగ్రతగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు. చక్కని కథ, కథనం, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, హీరో, 

అలరించిన ‘ప్రసన్న’ రాగాలు

Posted: August 1, 2016
ఈ ఆదివారానికి ఎన్నో ప్రత్యేకతలు
జూలై మాసం చివరి రోజు... సాయంత్రం 6 గంటలు
అల్లన తరలొచ్చిన మలయమారుత వీచికలు
మెలమెల్లగా కదిలొచ్చిన శ్రావణమేఘపు చిరుజల్లులు
బాలంత్రపు వారి యింట విరబూసిన సాహితీసుమాలు
ఆనక ఆహుతులను అలరించిన ‘ప్రసన్న’ రాగాలు
ఆపై ప్రసూనా హేమచంద్రలు పంచిన ఆత్మీయ ఆతిథ్యాలు

మనోనిబ్బరం సడలనీకు నేస్తం.

Posted: July 28, 2016


సాగే జీవనగానం… అణువణువున ఋతురాగం…
అంటూ... తన మృదు మధుర గానంతో
ఎందరో మనసులను దోచుకున్న సుమధుర గాయని సునీత...
కాలం చేసిన గాయం గేయమై స్రవిస్తున్నా..
వాసంత సమీరంలా తన చుట్టూ ఉన్నవారిని
తన గానంతో అలరిస్తూ...
తాను మాత్రం కొవ్వొత్తిలా కరుగిపోతూ..

నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి..

Posted: July 20, 2016
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.. ఆ కన్నీళ్ల ఎనకాల ఏముందో తెలుసునా’
అని ఆత్రేయ గారు చెబుతారు.
నవ్వడం వరకు పర్వాలేదు కానీ...
ఏడ్వడం దగ్గరకొచ్చే సరికే వస్తుంది అసలు తంటా..
అంతేకాదండోయ్.. ఇంకో సామెత కూడా వుంది..
‘నవ్వే ఆడదాన్ని.. ఏడ్చే మగాడ్ని నమ్మకూడదని’..
నిజానికి కన్నీళ్లకు ఆడ, మగ అనే తేడా వుంటుందా?

భార్యపై అనుమానం... శీల పరీక్షతో అవమానం..

Posted: July 15, 2016

నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాలి.
పురుషాధిక్య సమాజంలో స్త్రీల అణచివేత,స్త్రీలపై జరుగుతున్న అరాచకాలకిదో మచ్చుతునక.
భార్యపై అనుమానంతో శీల పరీక్ష పెట్టాడో మృగాడు.
ఈ మృగాడికి వంతపాడారు గ్రామ కుల పెద్ధలు.
వాళ్లూ మగాళ్లే కదా...

వ్యథార్థ వనితల యథార్థ గాథలు

వ్యథార్థ వనితల యథార్థ గాథలు
Posted On: Saturday,July 9,2016
 'కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు..' సంపుటిలోవి కథలు కావు, జీవితాలు. ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఎదురయ్యే సజీవ దశ్యాలు. ఎదుటివారికి కనిపించని.. తాను మాత్రమే అనుభవించే వాస్తవ ఘటనలు. ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన

Monday, July 4, 2016

చైతన్యస్రవంతి సత్యవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు

ఆమె కథలు..
జీవితానికి అద్దిన పరిమళాలు
స్త్రీల ఆకాంక్షలకు నిర్వచనాలు
‘ఇల్లలకగానే పండగ కాదు’అంటూ ఉద్బోధించే జీవనసత్యాలు
ప్రతి కథలోనూ కనిపించే స్త్రీ కోణం..
పురుషుల నీడలుగా మిగిలిపోతున్న స్త్రీలను చక్కదిద్దే చైతన్యం
నివురుగప్పిన నిప్పులా వుండే కుటుంబ హింస స్వభావం
...ఇత్యాది అంశాలన్నింటినీ కథా వస్తువులుగా తీసుకొని..
తన చుట్టూ ఉన్న మనుషుల స్వభావాలను పాత్రలుగా మలుచుకొని
ఆమె సృష్టించే కథలు నెమ్మదిగా ఆలోచనలను రేపి..
మహాప్రవాహంలా వెంటబడతాయి.
స్త్రీల జీవితాలను తరచిచూసి,
వారి జీవితంలోని వేదనలను బలంగా వినిపించి,
తన రచనల ద్వారా స్త్రీల జీవిత ఆకాంక్షలకు బలమైన చేయూతనందించిన రచయిత్రి...
చాలా సాధారణంగా కనిపిస్తూ.. అసాధారణమైన రచనలు చేయడంలో ఆమె సవ్యసాచి..
తాను మరెవరో కాదు... ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారు.

Monday, June 27, 2016

నా మనసుతో ‘ఒక మనసు’

‘ఒక మనసు’ సినిమా రివ్యూ

ప్రేమ... ఎక్కడున్నామనదగ్గరే ఉన్నట్టుగా వుంటుంది... 
అన్నీ తానే అన్నట్టుగా వుంటుంది... ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటుంది...
ఆ అనుభూతిని నిర్వచించడం ఒక సాహసం... ఒక తప్పస్సు..
ప్రేమ ఎంత గాఢంగా వుంటుందో.... అంతే సున్నితంగా వుంటుంది.
ప్రేమలో ఉన్న ఒక జంట ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం..
ఒకరినొకరు స్పృశించుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం..
దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టు... 
దగ్గరగా ఉన్నా దూరమౌతామేమో అనే ఆర్తితో ఒకరిలో ఒకరు అన్నట్టుగా కలిసిపోవడం...
ఇది ఒక ఆర్తి.. ఒక అనుభూతి... ఒక అనుభవం...
ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమను.. అనుభూతిని... వర్ణించడం పుస్తకాల్లో చదవడానికి బాగానే వుంటుంది.
అదే అనుభూతిని వెండితెరపై ఆవిష్కరించాలంటే... 

గిజిగాడి గూడు

పల్లె ప్రాంతాల్లో, పొలాల్లో కనిపించే ఈ పక్షుల గూళ్లు... 
చూడటానికి ఎంతో ముద్దుగా వుంటాయి.
చిన్నచిన్న పిచ్చుకలు వీటిని అత్యంత చాకచక్యంతో నిర్మించుకుంటాయి. 
ఇవి గూడు కట్టుకోవడం చూస్తే.. ఎంతో ఆశ్చర్యంగా, అబ్బురంగా వుంటుంది.
చెయ్యి తిరిగి శిల్పి అద్భుతమైన శిల్పాన్ని చెక్కినంత సులభంగా... 

Friday, May 13, 2016

చినుకు మాసపత్రికలో ‘స్వేచ్ఛ’ నవలపై సమీక్ష

 ‘చినుకు’ మాసపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా
మే, 2016న వెలువరించిన ప్రత్యేక సంచికలో
ఓల్గా గారి ‘స్వేచ్ఛ’ నవలపై నా సమీక్ష

Tuesday, May 10, 2016

సుస్వరాల కోకిలకు జన్మదిన శుభాకాంక్షలు

 సినీ పాటల తోటలో సుస్వరాల విందు చేస్తోన్న వసంత కోకిల..
గానం, సంగీతం, సాహిత్యం, నాట్యం, యాంకరింగ్, డబ్బింగ్ వంటి
అనేక కళలో అభినివేశం...
సాంప్రదాయం... ఆధునికత కలబోసిన  అచ్చతెలుగు ఆణిముత్యం..
ఆత్మగౌరవం... నిండైన ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే హుందాతనం...
మాటలు నవనీతం.. పాటలు మృదుమధురం...
రమ్యమైన రూపం... ఒదిగి ఉండే వినయం..
ఆమె మరెవరో కాదు...గాన సరస్వతి సునీత.
మధుర గాయని సునీత ఉపద్రష్ట.
నేడు (మే 10) ఆమె పుట్టినరోజు.

    17ఏళ్ల క్రితం ‘ఈవేళలో నీవు ఏం చేస్తువుంటావో...’ అంటూ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ‘గులాబీ’బాల...‘ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ...ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే .. ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే...ఆనందాలు పెంచింది’.. అంటూ
అందాల గొంతులోని సుగంధాలతో సందడి చేస్తూనే వుంది. ఈ పాటంటే నాకెంతిష్టమో చెప్పలేను. 15ఏళ్ల వయసులో మొదటిసారిగా సినిమాలలో గాయనిగా ప్రవేశించారు. సుమారు 750 సినిమాలకు పైగా డబ్బిగ్, 3000 పైగా పాటలు...
స్వదేశంలోనే కాకుండా కువైట్, దుబాయ్, మలేషియా, సింగపూర్, లండన్, అమెరికా, ఫిలిప్పీన్స్ , కెన్యా  మొదలైన దేశాలలో  ఐదారొందలకుపైగా స్టేజీ షోలు చేసిన ప్రతిభాశాలి సునీత.

Thursday, April 28, 2016

అమెరికా(న్యూజెర్సీ)లో ఆత్మీయ ఆతిథ్యం

కొన్ని పరిచయాలు..
మన జీవితంలో శాశ్వత ముద్రను వేస్తాయి..
హృదయాన్ని తాకుతాయి...
స్నేహ సౌరభాలను గుబాళింపజేస్తాయి...
ఎప్పటికీ మరపురాని అనుభూతిని కలుగజేస్తాయి...
ఎన్నేళ్లయినా తీయని జ్ఞాపకంగా మిగులుతాయి...
అటువంటి ఆత్మీయ పరిచయమే రత్నశేఖర్-పద్మ గార్ల పరిచయం..
వారు అమెరికా వచ్చి దాదాపు 20ఏళ్లయినా..
ఎక్కడా అమెరికన్ లైఫ్ స్టైల్ కనిపించకపోవడం ఆశ్చర్యం.. ఆనందం కలిగించింది.
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినాపొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము’ అన్న పద్యం గుర్తొచ్చిందంటే..వారి జీవన విధానం ఎంత ఆహ్లాదకరంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు మూలాలను కాపాడుకుంటూ...
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిస్తూ..
వారి పాపను కూడా అదే ఒరవడిలో పెంచుతూ..
శాస్త్రీయ సంగీతం వంటి తెలుగు కళలను నేర్పిస్తూ..తెలుగునాట ఉండి తెలుగు సంస్కృతిని, తెలుగు భాషను
విచ్ఛన్నం చేస్తున్న ఎంతోమందికి వీరు స్ఫూర్తిదాయకం.
రత్నశేఖర్-పద్మ దంపతుల ఆహ్వానం మేరకు
వారింటికి డిన్నర్ కు వెళ్లాం..
వారితో గడిపిన మూడుగంటలు మూడు నిమిషాల్లా గడిచిపోయాయి.
వారిచ్చిన ఆత్మీయ ఆతిథ్యం ఎప్పటికీ మరువలేనిది.
వారి ప్రేమ, ఆత్మీయతలను గుండెలనిండా పదిలపర్చుకుని
ఒకింత భారమైన హృదయంతో వెనుదిరిగాము.
ఆ దంపతులు మా పట్ల కనబరచిన ఆదరణను
మిత్రులందరితో పంచుకుంటూ...
వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
న్యూజెర్సీ నుంచి..
28-04-2016





Monday, April 25, 2016

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలో....

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలో....
న్యూజెర్సీ వెళ్ళే విమానం కోసం... 24-04-2016 రాత్రి...

సుస్వరాల జానకమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

‘పగలే వెన్నెల... జగమే ఊయల..’ అంటూ తన గొంతులో చల్లటి వెన్నెలలు కురిపించగరు..
‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రనా ఎందువలన?’
అంటూ.
ముద్దుముద్దుగానూ పాడగలరు..
అది ఏ పాట అయినా..
ఏ రాగమైనా..
ఏ భాష అయినా..
మధురాతి మధురంగా ఆలపించగల
స్వర సుధామయి.. గాన రసమయి

నేడు (ఏప్రిల్ 23) ప్రపంచ పుస్తక దినోత్సవం....


April 23 at 9:38am 
 మిత్రులందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు....
‘పుస్తకం’.. తోడు నిలిచే నేస్తం. సకల విద్యల నేర్పే గురువు. స్ఫూర్తినిచ్చే వ్యక్తి. పుస్తకం
మనని ప్రేమిస్తుంది. జీవితం చీకట్లు కమ్మేసినప్పుడు దీపమై దారి చూపుతుంది. అందుకే..
‘మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు..
సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు..’ అంటారు ఓ రచయిత.
ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా పరిగణించడానికి విభిన్న కధనాలున్నాయి. చాలా మంది
ఏకాభిప్రాయానికి వచ్చిన కొన్ని అంశాలు....

Tuesday, April 19, 2016

నాతో కలిసి మళ్లీ నలుగురం..

అది 80వ దశకం...
అత్యంత ఉల్లాసంగా గడిపిన మా స్కూలు రోజులు...
ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన జ్ఞాపకాలు...
ఆ జ్ఞాపకాల్లో 2వ నెంబర్ సిటీ బస్ కు కూడా ఎంతో ప్రాధాన్యతుంది.
మా పక్క గ్రామం కొక్కిరిపాడు నుంచి ఏలూరు వచ్చే ఆ సిటీ బస్సులో
పొద్దున్నే 8.30కి స్కూళ్లకి వెళ్లేవాళ్ళం.
మా చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలనుంచి వచ్చే విద్యార్థులంతా ఆ బస్సు ఎక్కేవారు

Monday, April 18, 2016

‘కమలిని’ కథపై స్పందన

ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘కమలిని’ కథ గురించి నా అభిప్రాయాన్ని మిత్రులతో
పంచుకోవాలనుకుంటున్నా... రచయిత్రి సామాన్య గారు ఒక వినూత్నమైన ప్లాట్ ను ఎంచుకొని ఒక
ప్రయోగం చేశారు. చక్కని శిల్పంతో... మంచి భావుకతతో కూడిన అందమైన కవిత ఈ ఉత్తరం. అయితే..
ఈ కథ ద్వారా తను ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారో నాకు అర్థం కాలేదు. తాను చెప్పాలనుకున్న
విషయాన్ని ప్రజెంట్ చేయడంలో కొంత అస్పష్టత ఉందనిపించింది.

శ్రోతలను ఉర్రూతలూగించే కిక్కు...


ఆమె వయసు 69 ఏళ్లు...
అయినా... ఆ స్వరంలో ఏదో మత్తు...
శ్రోతలను ఉర్రూతలూగించే కిక్కు...
ఆమె పాట అందుకుంటే... యువత వెర్రెత్తిపోతారు..
సినిమాల్లో ఆమె పాడినవి తక్కువ పాటలే...
అయినా... తన గాత్రంతో తనదైన స్వరముద్ర...
ఆమె మరెవరో కాదు....
ప్రముఖ పాప్ సింగర్ ఉషా ఉతుప్ గారు.
జీ తెలుగు ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి నిర్వహించిన ‘అప్సర అవార్డ్స్‌-2016’ కార్యక్రమంలో గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఆ కార్యక్రమాన్ని ఈరోజు (ఆదివారం) సాయంత్రం జీటీవీలో ప్రసారం చేశారు.
ఈ వయసులో కూడా అరగంట పాటు ఏకదాటిగా తెలుగు, హిందీ, మారాఠీ, స్పానిష్ పాటలను అద్భుతంగా ఆలపించారు.
తన బృందం హుషారైన డాన్సులతో అలరించారు.
కీచురాళ్ళు, రేసుగుర్రం, దమ్మరె దమ్... వంటి పాటలు అంటూ ఆమె పాడుతుంటే... హాల్ అంతా ఈలలు, కేరింతలతో ఊగిపోయింది.
అదీ... ఆమె స్టైల్.
ఆ సుమధుర స్వరం మరిన్ని వసంతాలు మనను అలరించాలని కోరుతూ... వారిని నా అభినందనలు..

కందుకూరి స్ఫూర్తి నేటి తరానికి కావాలి దిక్సూచి

April 16 at 11:21am

గొప్ప సాహితీ వేత్త, సంస్కర్త...
వితంతు వివాహాలు నిర్వహించిన మహనీయుడు...
బాలికల కోసం ప్రత్యేకంగా ఒక విద్యాలయాన్ని ప్రారంభించిన అభ్యుయవాది...
కందుకూరి వీరేశలింగం పంతులు గారి పుట్టినరోజు.
1848 ఏప్రిల్ 16న సుబ్బారాయుడు, పూర్ణమ్మ దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించారు.
ఆ రోజుల్లో సమాజంలో ఉన్న మూఢ ఆచారాలు వీరిని కలచివేసాయి. ముఖ్యంగా స్త్రీల సమస్యలు వీరిని ప్రభావితం చేసాయి. సంఘ సంస్కరణకు నడుం బిగించారు. వితంతు వివాహాలు నిర్వహించటం, బాల్య వివాహాలు నిరోధించటం వీరి సంస్కరణలోని ముఖ్యాంశాలు. స్త్రీలకు విద్య నేర్పించక పోవటమే ఈ దురాచారాలకు కారణమని భావించి ధవళేశ్వరంలో 1874 బాలికల కోసం ప్రత్యేకంగా ఒక విద్యాలయాన్ని ప్రారంభించారు.

Sunday, April 10, 2016

ఈ దేశం ఎటుపోతోంది?

మూఢ భక్తి, మూఢవిశ్వాసాలు
మహా విషాదాలుగా మారుతుంటే...
మనసు ఘోషిస్తోంది
నాసిక్ కుంభమేళలో తొక్కిసలాట
మహారాష్ట్రలోని మంధ్రాదేవి గుడిలో తొక్కిసలాట
హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట
జోధ్ పూర్ లోని చాముండాదేవి ఆలయంలో తొక్కిసలాట
కేరళలోని శబరిమల వద్ద తొక్కిసలాట
రాజమండ్రి గోదావరి పుష్కరాల తొక్కిసలాట
ఇప్పుడు పుట్టింగల్ దేవి ఆలయంలో...
ఇలా ఒకటా రెండా...
భక్తి పేరుతో జరుగుతోన్న ఈ తొక్కిసలాటల్లో
మృతిచెందుతున్న వారి కుటుంబాల పరిస్థితేమిటీ?
ఇది ఎవరి ఆలోచనలకూ తట్టని ఓ కఠిన వాస్తవం.
మనిషి అంతరిక్షయానం చేస్తున్నా...
అధునాతన సాంకేతికతను సృష్టిస్తున్నా
మూఢవిశ్వాసాలను పట్టుకు వేలాడుతుంటే..
ఈ దేశం ఎటుపోతోంది?
ఇటీవలి కాలంలో మూఢత్వాన్ని రెచ్చగొడుతున్న వైనం
మన కళ్లముందు కనిపిస్తోన్న కఠోరవాస్తవం.
భక్తి మహత్తులో మునిగి
కుటుంబాలను అనాధాలను చేయొద్దు.
మీమీ జీవితాలను అర్థాంతరంగా ముగించుకోవద్దు...
ఇలాంటి దుర్ఘటనల్లో ప్రాణాలను బలిపెట్టొద్దు.
కేరళ పుట్టింగల్ ఘటనకు
చలించిన నా మనసు పడే ఆవేదన ఇది...

Saturday, April 9, 2016

అక్షరాల మగ్గంపై యండమూరి నేసిన ‘నల్లంచు తెల్లచీర’


యండమూరి రచనల్లో కాలక్షేపానికి చదివేవీ
పండువెన్నెల్లో విహరిస్తున్న అనుభూతిని కలిగించేవీ..
మళ్లీ మళ్లీ చదవాలనిపించేవీ...
ఒక సందేశం, ఇన్ స్పిరేషన్ ఇచ్చేవీ..
వ్యక్తిగత లైబ్రరీలో దాచుకోదగినవీ...
ఇలా... అనేక రచనలున్నాయి.
వాటిలో ‘నల్లంచు తెల్లచీర’ నవల ఒకటి.
వీధుల వెంట తిరిగి చీరలమ్ముకునే ఓ కుర్రవాడు బడా వస్త్రవ్యాపారులపై సంధించిన అస్త్రం.
నిబిడీకృతమైన తెలివితేటలకి బహుమతిగా జీవితపు తొలిముద్దు...
కీలక మలుపునకు దారితీసిన అదే ముద్దు...
చీరలు కట్టడంలో ఆరితేరిన వారికి కూడా చీర మెళకువల చిత్రాతిచిత్రాలు నేర్పిన చమత్కారం...

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates