Posted: September 20, 2016
భరతమాత సేవకు
ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన
అమర వీరులారా..మీకు జేజేలు
130కోట్ల మంది భారతీయులు
శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు అశ్రునయనాలతో..
మీ సాహసం... మీ త్యాగం
యువతకు ఆదర్శం..శిరోధార్యం
//అమర జవానులారా... మీకు వందనం//
జోహార్ వీరులారా... అమర జవానులారా...
శత్రువు దొంగదెబ్బ తీసినా...
గుండులు గుండెను చీల్చినా...
రక్తం ఏరులై పారినా...
శత్రువు దొంగదెబ్బ తీసినా...
గుండులు గుండెను చీల్చినా...
రక్తం ఏరులై పారినా...
భరతమాత సేవకు
ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన
అమర వీరులారా..మీకు జేజేలు
130కోట్ల మంది భారతీయులు
శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు అశ్రునయనాలతో..
మీ సాహసం... మీ త్యాగం
యువతకు ఆదర్శం..శిరోధార్యం
***
కాశ్మీర్ లోని యురిలో ఉగ్ర ఘాతుకం
ఆర్మీ చరిత్రలోనే అత్యంత హేయమైన దాడి.
ఆదివారం వేకువజామున 5.30 ప్రాంతంలో జరిగింది.
సరిహద్దుల కాపలాలో నిమగ్నమయ్యే సైనికులు విధులు మారేవేళ
మాటు వేసిఉన్న నరవ్యాఘ్రాలు శిబిరం వెనక వైపు నుంచి దూసుకొచ్చి
అధికారుల భోజనశాలను పేల్చివేసే భయానక లక్ష్యంతో తీసిన దొంగదెబ్బ ఇది.
ముష్కర మూకల దొంగదెబ్బ అత్యంత హేయమైన చర్య ఇది.
ఈ దాడిలో మంటలకు ఆహుతైన వారే ఎక్కువ.
20మంది వీరులను కోల్పోయిన దుస్సంఘటన యావత్ జాతినీ నిర్ఘాంతపరచింది.
కొందరు జవాన్లు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషాదం గుండెల్ని పిండేస్తోంది.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ...
వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు
ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా...

No comments:
Post a Comment