Posted: August 15, 2016
స్వాతంత్ర్యదినోత్సవం... భారతీయులందరికీ పెద్ద ఉత్సవం
పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప అని... చెప్పినట్టుగా
ఈ దేశం నాదని నినదించాం... బ్రిటిష్ పెత్తనాన్ని పారద్రోలాం..
ఆ ఔన్నత్యం.. ఉత్తేజం అందించిన భారతీయ వారసులం మనం...
69ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో సమస్యలు... సవాళ్లు

నాటి సతీ సహగమనం నుంచి నేటి భ్రూణ హత్యల వరకు మహిళలే బలి పశువులు..
మహిళను కట్టు బానిసను చేసిన మనుధర్మశాస్త్ర కట్టుబాట్లను ఎదిరించి...
నేనూ మనిషినే... నాకూ స్వేచ్ఛ.. స్వాతంత్ర్యం కావాలని నినదించి... ఆకాశమంత
ఎదిగింది మహిళ.
ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుందని...
వంటింటినే కాదు... దేశాన్నీ నడపగలదని
వందేళ్ల క్రితమే గురజాడ వారు మహిళ పట్ల ప్రదర్శించిన విశ్వాసం
నేటి తరానికి ఆదర్శం కావాలి.
కత్తి పట్టి రాజ్యమేలిన ఝాన్సీలక్ష్మి, రుద్రమదేవి నుంచి...
నేటి పురుషాధిక్య ప్రపంచంలో నాయకులుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగిన
మేటి మహిళామణులెందరో స్ఫూర్తిప్రదాతలు..
ఒక స్త్రీ విద్యావంతురాలైతే...
కుటుంబమూ విద్యావంతమౌతుంది... సమాజమూ అభివృద్ధి అవుతుంది
సడలని ఆత్మవిశ్వాసంతో...
ఈ స్వాతంత్ర్యదినం ఇచ్చిన స్ఫూర్తితో...
గురజాడ వారి ఆకాంక్ష సాధనలో...
మరోఅడుగు ముందుకేద్దాం...
మనని మనం గౌరవించుకుందాం
సమాజాభివృద్ధిలో దివిటీలమై వెలుగులు నింపుదాం..
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
No comments:
Post a Comment