ఆమె పాట మనసుకు ఉల్లాసం
తనే మన గానకోకిల సుశీలమ్మ
‘పాడమని నన్నడగవలెనా.. పరవశించీ పాడనా..’ అంటూ
ఆ కోయిలమ్మ పాట ప్రారంభిస్తే అమృతమ్ము జాలువారదా..
‘ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయా.. ముత్తైదు కుంకుమా బతుకంతా ఛాయా..’ అంటూ
గానకోకిల ఆమె బిరుదు
తాను పాడిన పాట వేకువ జామున తానే వచ్చి సుప్రభాతం ఆలపించినట్టు ఉండదూ...
ఇక ‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై..’ అంటూ తాను పరవశించి పాడుతుంటే
ప్రకృతి పరవశంతో నాట్యం చేయదా...
ఇలా ఒకటా రెండా... వేలాది పాటలు
ఆ స్వర ఝరి నుంచి అలలు అలలుగా జాలువారుతుంటే...
రంజిల్లని హృదయం వుంటుందా... అనుభూతి చెందని మనిషి వుంటాడా...
ఆరు భాషల్లో మొత్తం 17,695 పాటలు పాడినందుకు గానూ
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.
తెలుగువారమైన మనందరికీ గర్వకారణమిది.
ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందన సుమాలు.
తన కోకిల గాత్రంతో వేలాది పాటలు పాడి కోట్లాది శ్రోతల హృదయాలను రంజింపచేసిన గాయనీమణి పులపాక
సుశీల. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా,
సంస్కృతం, తులు భాషల్లో మొత్తం 17,695 పాటలు పాడారు. ఘంటసాల మధుర గాత్రంతో జత
కలిసిన సుశీల గొంతు లెక్కకు మిక్కిలిగా మరచిపోలేని యుగళ గీతాలను అందించారు. ఒక్క ఎస్పీ
బాలసుబ్రమణ్యంతోనే 1,336 యుగళగీతాలను ఆలపించారు. ఒకే జంట ఇన్ని పాటలు కలిసి పాడడంలో
ఇప్పటికీ వీరిదే రికార్డు. ఇక.. కృష్ణశాస్త్రి, పింగళి, సముద్రాల, సినారె, ఆత్రేయ, వేటూరి
హేమాహేమీలయిన రచయితల గీతాలు సుశీలమ్మ అమృత స్వర ఝరిలో మునిగి
చిరస్మరణీయములయ్యాయి. ఆవిడ ప్రతి పాట ఆణిముత్యమే.
1950లో గాన ప్రపంచంలోకి అడుగుపెట్టిన పులపాక సుశీల... నవంబరు 13, 1935న
విజయనగరంలోని సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు. 1950లో సంగీత దర్శకుడు
నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎంపిక చేశారు. ఆమె
ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ‘ఎదుకు అలత్తాయ్’ అనే
పాటను మొట్ట మొదటిసారిగా పాడారు. 2008లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును
పొందారు. ఉత్తమ నేపథ్య గాయనిగా ఐదు సార్లు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాల్లోనే
కాక పలు భక్తిగీతాలు కూడా పాడి ఆల్బమ్స్ విడుదల చేశారు.

No comments:
Post a Comment