‘పగలే వెన్నెల... జగమే ఊయల..’ అంటూ తన గొంతులో చల్లటి వెన్నెలలు కురిపించగరు..
‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రనా ఎందువలన?’ అంటూ.
ముద్దుముద్దుగానూ పాడగలరు..
అది ఏ పాట అయినా..
ఏ రాగమైనా..
ఏ భాష అయినా..
మధురాతి మధురంగా ఆలపించగల
స్వర సుధామయి.. గాన రసమయి
మన తెలుగింటి ఆడపడుచు..
ఎస్.జానకి గారు.
తన 18వ ఏటనే సినీ గాయనిగా
కెరీర్ ప్రారంభించిన జానకి గారు
హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు,
సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి...
ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కెజె.జేసుదాస్,
ఎల్ఆర్.ఈశ్వరి, పి.జయ చంద్రన్, పి.లీలా, కెఎస్.చిత్ర,
సుజాత, జెన్సీ, పిబి.శ్రీనివాస్, ఇళయరాజా,
ఎస్.బి.బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో కలిసి
ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు.
ఎంతటి రాగమైన అతి సులభంగా పాడగలరు.
నాలుగుసార్లు జాతీయ పురస్కారం,
కేరళ,తమిళనాడు, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతోపాటు
మన రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డును
10సార్లు అందుకోవడం వారి ప్రతిభకు తార్కాణం.
ఇదేకాకుండా ఫిలింఫేర్ వంటి అనేక అవార్డులు వారిని వరించాయి.
2013లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించినప్పటికీ
దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో
ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
అటువంటి అపూర్వ గాయనీమణి జానకి గారి
పెయింటింగ్ ను చిత్రించిన ఆ కళాకారునికీ
ఈ సందర్భంగా అభినందనలు తెలపాలి.
జానకిగారి చిత్రాన్ని జీవం ఉట్టిపడేలా చిత్రించారు.
ఈ చిత్రం చూసిన ఆనందంలో... ఈ నాలుగు మాటలు.

No comments:
Post a Comment