Social Icons

Thursday, March 31, 2016

ఓల్గా ‘కళ్లు’


ఆదివారం ‘ఈనాడు’ ఆదివారం పుస్తకంలో ఓల్గా గారి ‘‘కళ్ళు’’ కథ చదివాను. చాలా చిన్న కథ...
అయితేనేం లోతైన కథ.
తరతరాలుగా మహిళలపై బలవంతంగా రుద్దబడుతోన్న ఆంక్షల గాథ.
తల్లి, భార్య, కుమార్తె...ల అను‘బంధం’ వేసిన అందమైన వ్యథ.
ఈ కథ ప్రారంభంలోనే...
‘ఆడపిల్ల కళ్లంటే సమాజానికి భయం.
ఎత్తిచూస్తే చాలు ఎగిరెగిరిపడుతుంది.
నల్లకాటుకతో గంతలు కట్టాలనుకుంటుంది.
కన్నీళ్లలో మునకలేయించాలని ప్రయత్నిస్తుంది.
ఓల్గా ‘కళ్లు’... పాతికేళ్ల పాత కథే అయినా,
కంట్లో నలుసై వేధిస్తున్న తీవ్ర వివక్షను ప్రశ్నించే కథ.’
స్త్రీ కళ్ల గురించి, ఆ కళ్ల అందాలను వర్ణిస్తూ ఎన్నో కథలు, కవితలు వచ్చాయి.


ఆమె అందం నాలుగు గోడలకే పరిమితమైతే..
తన చుట్టూ జరుగుతున్న దారుణాలనైనా కనీసం కనులెత్తి చూడలేకపోతే
ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకుంటేనేమి..
వేదికలెక్కి ఎన్ని ఉపన్యాసాలిస్తేనేమి..
చంద్రమండలానికెళ్లొస్తేనేమి..
అందుకే అంటాడు చలం..
‘స్త్రీకి కూడా శరీరం ఉంది.
దానికి వ్యాయామం ఇవ్వాలి.
ఆమెకు మెదడు వుంది,
దానికి జ్ఞానం ఇవ్వాలి,
ఆమెకు హృదయం ఉంది,
దానికి అనుభవం ఇవ్వాలి... అని.
ఈ కథలో ఒక చిన్న పాప తన అందమైన ప్రపంచాన్ని చూడడానికి కూడా ఎన్ని ఆంక్షలు..
‘నాకు నాన్న చేతిలో మామిడిపళ్ల బుట్ట కనపడిందనుకో - ‘ఓ మామిడిపళ్లొ’ అని ఎగరబుద్ధేస్తుంది.
ఎగరకూడదంట. ఆ మామిడిపండు మన కంచంలోకి వచ్చేవరకూ అరవకూడదంట.
మన కంచంలోకి వచ్చాక బుద్ధిగా తినాలంట. మామిడిపళ్లు చూడగానే ఎగరకపోతే చూసిన ఫలితం ఏముంది?’
...ఇలా ప్రశ్నించడమేగా ఈ సమాజానికి నచ్చనిది.
అన్న, తండ్రి, భర్త, కొడుకు... వీరి ఆంక్షలకు తలొగ్గాల్సిందేనా...
ఎన్ని ఉన్నత చదువులు చదివినా.. అత్యున్నత పదవులనలంకరించినా
ఆ కళ్లకు స్వేచ్ఛ లేనప్పుడు... ఆ మనసుకు స్పందన లేనప్పుడు.
ఆమె కళ్ళు తెరిస్తే ప్రపంచాన్ని ఎక్కడ చూస్తుందోనని భయం.
ఎక్కడ ప్రశ్నిస్తుందోనని ఆందోళన.
తన ఆధిపత్యాన్ని సవాల్ చేస్తుందేమోనని దుగ్ధ..
ఇప్పుడైనా...
ఈ మహిళాదినోత్సవ చైతన్య స్ఫూర్తితోనైనా
ఇంటి నుంచి వెలుపలి వరకూ
నువు దృష్టి సారించగలిగినంత వరకూ
సమాజంలో జరిగే ప్రతి ఘటననూ చూడు
చెడును ప్రతిఘటించు
నీ చుట్టూ గీసిన లక్ష్మణ రేఖలను దాటుకొని బయటికిరా...
వారినలా స్వేచ్ఛగా ఒదలడమొక్కటే పురుషుడామెకు చేయగల సాయం.

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates