‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.. ఆ కన్నీళ్ల ఎనకాల ఏముందో తెలుసునా’
అని ఆత్రేయ గారు చెబుతారు.
నవ్వడం వరకు పర్వాలేదు కానీ...
ఏడ్వడం దగ్గరకొచ్చే సరికే వస్తుంది అసలు తంటా..
అంతేకాదండోయ్.. ఇంకో సామెత కూడా వుంది..
‘నవ్వే ఆడదాన్ని.. ఏడ్చే మగాడ్ని నమ్మకూడదని’..
నిజానికి కన్నీళ్లకు ఆడ, మగ అనే తేడా వుంటుందా?

మనసులో బాధ అయినా, సంతోషమైనా వెల్లులా ఉప్పొంగితే...
అది హృదయాన్ని ఉవ్వెత్తున తాకితే...
కనులు వర్షించేవే కన్నీళ్లు...
మనసులోని బాధను పంటి బిగువున భరిస్తారు కొందరు..
కంటి వరదలా ప్రవహిస్తారు మరికొందరు...
కన్నీళ్లకు ఆడ, మగ తేడా వుంటుందంటారు పెద్దలు..
అదేనండీ... మగాళ్లు కన్నీళ్లు పెట్టకూడదు అంటారు కదా...
ఏమిటీ ఉపోద్ఘాతం లేని కన్నీళ్లు.... అనుకుంటున్నారా...
అసలు విషయానికొస్తే...
ఈమధ్యనే చినుకు 11వ వార్షికోత్సవ సంచికలో సలీం రాసిన ‘కన్నీళ్లు’ కథ చదివాను.
ఇదంతా దాని ప్రభావమే...
***
సలీం గారు రాసిన ‘కన్నీళ్లు’ కథ చాలా బాగుంది.
అక్క పుట్టిన రోజున టెడ్డీబేర్ ఇవ్వలేదని ఏడుస్తున్న కొడుకుని ఎత్తుకుని ‘మగపిల్లలు ఏడ్వకూడదు నాన్నా..
మనింటికొచ్చిన వాళ్లందరూ ఏమనుకుంటారో తెలుసా... ఆడపిల్లలా ఏడస్తున్నాడు చూడని నవ్వుకుంటారు.
ఎప్పుడూ ఏడ్వకూడదు అర్థమైందా’ అంటుంది అమ్మ.
కాలేజీలో తనను ఎవరో వేధిస్తున్నాడని అమ్మకు చెప్పి బాధపడుతున్న అక్కను.. ఏం జరిగిందని అడిగితే..
‘కొన్ని విషయాలు మగపిల్లలతో చెప్పకూడనివి వుంటాయి’ అంటుంది అక్క..
ఆ వేధింపులు భరించలేక అక్క ఉరివేసుకొని చనిపోతుంది. ఒకవైపు అమ్మ పొర్లిపొర్లి ఏడుస్తుంది. మగాళ్లు
ఏడ్వ కూడాదని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇన్నేళ్లుగా ఆపుకుంటూ వచ్చిన ఏడుపు... అక్కడ శవాన్ని
చూసి అపుకోలేకపోతాడు.
‘మగపిల్లాడివై వుండి నువ్వే ఇలా ఏడిస్తే.. అమ్మనెవరు ఓదరుస్తారు చెప్పు? మనం మగవాళ్లం. గుండె
రాయి చేసుకోవాలి’ అంటాడు నాన్న.
తను ప్రేమించిన అమ్మాయికి ఆ విషయం చెబితే.. నా స్నేహాన్ని అపార్థం చేసుకున్నావు. సారీ అంటుంది
స్వాప్నిక. ఆ విషయాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటాడు.
‘మగాళ్లు ఏడుస్తుంటే చూడ్డానికి ఎంత అసహ్యంగా వుంటుందో తెలుసా...’ అంటుంది. తనను ప్రేమించిన
వినోదిని.
చివరకు వినోదినిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ప్రాణ హాని వుందని తెలిసినా వారసత్వం కోసం
బాబును ప్రసవించి వినోదిని చనిపోతుంది. చంటిబిడ్డను నిర్జీవంగా పడివున్న భార్య పక్కన చూసి పొర్లి పొర్లి
ఏడుస్తాడు.
‘మగాళ్లు ఏడ్వకూడదు. గుండె రాయి చేసుకోవాలి’ అంటాడు నాన్న.
‘‘ఊహ తెలిసినప్పటి నుంచి మగాళ్లు ఏడ్వ కూడదంటూ పదే పదే చెప్పి నన్ను ఏడ్వకుండా ఆపారు. ఇప్పుడు
ఏడ్వకపోతే నా గుండె బద్దలైపోతుంది నాన్నా’’ అంటూ కన్నీళ్ల సంద్రంలా మారిపోతాడు.

మగాళ్లు ఎందుకు ఏడ్వకూడదు? వాళ్ళు మనుషులు కారా? వాళ్లకు హృదయం ఉండదా? అందులో
సున్నితత్వం వుండదా? తనివితీరా ఏడ్చి గుండె బరువు దింపుకునే అవకాశం ఆడవారికేనా...?
ఒక సున్నితమైన అంశాన్ని మంచి ఇతివృత్తానికి జోడించి.. చక్కగా రాశారు.
మనసులోని బరువు దింపుకోడానికి కన్నీళ్ల సంద్రానికి అడ్డుకట్ట వేయక్కర్లేదని..
ఎంచక్కా తనివితీరా ఏడ్చి గుండెబరువుదించుకోవచ్చని...
కన్నీళ్లకు ఆడ, మగ తేడాలేదని.. గుండె బరువు దించుకోడమే ప్రధానమని చక్కగా చెప్పారు.
అందరూ చదవాల్సిన మంచి కథ ఇది.

No comments:
Post a Comment