Social Icons

Monday, April 25, 2016

నేడు (ఏప్రిల్ 23) ప్రపంచ పుస్తక దినోత్సవం....


April 23 at 9:38am 
 మిత్రులందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు....
‘పుస్తకం’.. తోడు నిలిచే నేస్తం. సకల విద్యల నేర్పే గురువు. స్ఫూర్తినిచ్చే వ్యక్తి. పుస్తకం
మనని ప్రేమిస్తుంది. జీవితం చీకట్లు కమ్మేసినప్పుడు దీపమై దారి చూపుతుంది. అందుకే..
‘మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు..
సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు..’ అంటారు ఓ రచయిత.
ఏప్రిల్ 23ను ప్రపంచ పుస్తక దినోత్సవంగా పరిగణించడానికి విభిన్న కధనాలున్నాయి. చాలా మంది
ఏకాభిప్రాయానికి వచ్చిన కొన్ని అంశాలు....

1. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అను రచయితలు 1616 ఇదే రోజున
మరణించారు.
2. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ
ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జన్మించడమో జరగడం విశేషం.
3. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో
ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును1995లో యునెస్కో ప్రపంచ పుస్తక దినంగా ప్రకటించడమేకాదు,
ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలను, ప్రచురణకర్తలను,
పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది.
అందుకే.. పుస్తకాన్ని కొందాం. పుస్తకాన్ని బ్రతికించుకొందాం. ‘చినిగిన చొక్కానైన
తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వీరేశలింగం గారు చెప్పినట్టుగా ఈ పుస్తక
దినోత్సవం రోజునైనా ఒక పుస్తకం కొనండి. ‘కొన్ని పుస్తకాలు రుచి చూడాలి.. కొన్నింటిని
మింగేయాలి, కొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి’ అని ప్రముఖ రచయిత బేకన్ చెబితే...
‘పుస్తకం కన్నతల్లి పాత్రను పోషిస్తుంది’ అని రష్యన్ రచయిత మాక్సిం గోర్కీ చెప్పారు. మంచి
పుస్తకం జ్ఞానాన్ని రంగరించి పెడుతుంది. దాన్ని జీర్ణం చేసుకొని నరనరానికి ఎక్కించుకోవడమే మనం
చేయాల్సింది. మరో ప్రముఖ రచయిత కాఫ్కా అయితే ఇంకాస్త ముందుకెళ్లి మంచి పుస్తకం
ఎలావుండాలో ఇంకా గొప్పగా చెప్పారు. ‘మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనల్నే
మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొలపని పక్షంలో అసలు
చదవడం ఎందుకు? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి.
మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచివేయాలి. అందరికీ
దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మనలో గడ్డకట్టిన
సముద్రాల్ని గొడ్డలిలాగా పగలగొట్టాలి’ అంటారు కాఫ్కా.
అందుకే ఈ పుస్తకదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక్క పుస్తకమైనా కొనండి... మనలో
గడ్డకట్టిన సముద్రాల్ని పగలగొట్టండి.

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates