మళ్లీ వచ్చింది ఉగాది
షడ్రుచుల శోభను తెచ్చింది ఉగాది
మళ్లీ వచ్చింది ఉగాది
మళ్లీ వచ్చింది ఉగాది
భూగర్భ జలాలు అడుగంటి
మామిడి కాపు తగ్గి
పుల్ల మామిడి చేదెక్కి
షడ్రుచుల పచ్చడి పలుచనైంది
మళ్లీ వచ్చింది ఉగాది
మామిడి కాపు తగ్గి
పుల్ల మామిడి చేదెక్కి
షడ్రుచుల పచ్చడి పలుచనైంది
మళ్లీ వచ్చింది ఉగాది
పట్టణీకరణ పెరిగి
చెట్లన్నీ నరికేయబడి
వేప పూతే కరువయ్యింది
షడ్రుచుల పచ్చడి పలుచనైంది
మళ్లీ వచ్చింది ఉగాది
చెట్లన్నీ నరికేయబడి
వేప పూతే కరువయ్యింది
షడ్రుచుల పచ్చడి పలుచనైంది
మళ్లీ వచ్చింది ఉగాది
పండించడానికి నీళ్లులేక
పండిస్తే రేటు రాక
బెల్లం బట్టీలన్నీ మూతబడి
తీపిబెల్లం వగరెక్కింది
షడ్రుచుల పచ్చడి పలుచనైంది
మళ్లీ వచ్చింది ఉగాది
పండిస్తే రేటు రాక
బెల్లం బట్టీలన్నీ మూతబడి
తీపిబెల్లం వగరెక్కింది
షడ్రుచుల పచ్చడి పలుచనైంది
మళ్లీ వచ్చింది ఉగాది
మండుతున్న ఎండలు
నోళ్లు తెరుస్తున్న చెరువులు
అడుగంటుతున్న బావులు
కీలోమీటర్లు నడిచి తెచ్చే కడివెడు నీళ్లు
అనుపాకం కానుంటూ మొరాయిస్తుంటే..
షడ్రుచుల పచ్చడి వెలవెలబోయింది
మళ్లీ వచ్చింది ఉగాది
నోళ్లు తెరుస్తున్న చెరువులు
అడుగంటుతున్న బావులు
కీలోమీటర్లు నడిచి తెచ్చే కడివెడు నీళ్లు
అనుపాకం కానుంటూ మొరాయిస్తుంటే..
షడ్రుచుల పచ్చడి వెలవెలబోయింది
మళ్లీ వచ్చింది ఉగాది
No comments:
Post a Comment