Social Icons

Monday, April 18, 2016

‘కమలిని’ కథపై స్పందన

ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ‘కమలిని’ కథ గురించి నా అభిప్రాయాన్ని మిత్రులతో
పంచుకోవాలనుకుంటున్నా... రచయిత్రి సామాన్య గారు ఒక వినూత్నమైన ప్లాట్ ను ఎంచుకొని ఒక
ప్రయోగం చేశారు. చక్కని శిల్పంతో... మంచి భావుకతతో కూడిన అందమైన కవిత ఈ ఉత్తరం. అయితే..
ఈ కథ ద్వారా తను ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారో నాకు అర్థం కాలేదు. తాను చెప్పాలనుకున్న
విషయాన్ని ప్రజెంట్ చేయడంలో కొంత అస్పష్టత ఉందనిపించింది.

కథ విషయానికొస్తే... ఇదొక సింగిల్ పాయింట్. ‘తాను పాతివ్రత్యాన్ని కోల్పోయానని, ఏ పరిస్థితిలో అలా
జరిగిందో చెబుతూ... తనను క్షమించాలని కోరుతూ... కమలిన తన భర్తకు ఉత్తరం రాస్తుంది’.
వివాహేతర సంబంధాలపై ఇటీవల కథలు, నవలలు వస్తున్నాయి. ఇదొక సున్నితమైన సమస్య. ఇది స్త్రీ
స్వేచ్ఛకు... నైతికతకు సంబంధించిన అంశం. తరతరాలుగా మగవాడు తప్పు చేస్తున్నా.. భార్యలు
భర్తిస్తూనే వున్నారు కాబట్టి భార్యలు తప్పు చేసినా ఫర్వాలేదా? అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతోంది.
ఒకవైపు పాశ్చాత్య సంస్కృతి స్త్రీ స్వేచ్ఛకు కొత్త అర్థాన్ని చెబుతోంటే.. మరోవైపు సంస్కృతి,
సాంప్రదాయాలు నేర్పిన పాతివ్రత్య ముసుగును తొలగించి విశాల ప్రపంచాన్ని చూసే ప్రయత్నం ఇక్కడ
జరుగుతోంది. అయితే.. ఇక్కడ స్వేచ్ఛ... సమానత్వంతో పాటు నైతికత అవసరాన్ని కూడా గుర్తించాలి.
ఈ కథలో తాను పాతివ్రత్యాన్ని కోల్పోయానని చెబుతూ... భర్త గొప్ప తనాన్ని ప్రస్తుతస్తుంది కమలిని. ‘....
ఎప్పుడూ నిర్మలంగా, నీరవ నిశ్శబ్ద కాటుకలాంటి నింగిని వెలిగించే పూర్ణశశాంకుడిలా నన్ను అల్లుకుని నా
జీవితాన్ని వెలిగిస్తూ.. నీ సంతోషపు సంపదని, క్రోధాన్ని, వైరాగ్యాన్ని, విజయాలనీ అన్నిటినీ నాకు
పంచుతూ, నాకే పంచుతూ మరేమీ ధ్యాసలేని నీవు ఎంత గొప్పవాడివో కదా..’ అంటుంది. అంటే... భర్త
తనను అంతగా ప్రేమించినా.. తనకు అంతటి ప్రాధాన్యతనిచ్చినా... ఈ రకమైన చర్యకు పాల్పడడాన్నిఎలా
చూడాలనే ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాదు... తన చర్యను సమర్థించుకుంటూ ‘ఈ స్మార్ట్ సమాజంలోని
ఆధునిక పురుషులు స్త్రీలను ఎంత తీవ్రంగా పర్స్యూ చేస్తారో చెబుతూ.. అనేక ఉదాహరణలను చెబుతుంది.
ఇదంతా తను చేసిన తప్పును ఒప్పుకుంటూనే... సమర్థించుకునేందుకు చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది.
కథ మొదట్లో....
‘నీవు అంగీకరించవని నీ తరఫున వకాల్తా పుచ్చుకుని నేనే ఎలా చెప్పేస్తున్నానని అనుకుంటున్నావు
కదా? ఎలా చెపుతున్నానంటే, నేనే నీవయితే నేను ఒప్పుకోను గనక.’
కథ చివరిలో...
‘భూమి పుట్టినప్పటి నుండి ఎందరెందరో భార్యలు ఎందరెందరో భర్తల్ని, వేరే స్త్రీల వద్ద శీలం కోల్పోయి
వచ్చినా, రెండో కాపురాలే పెట్టినా... భరించి కాపురాలు చేశారు కదా నువ్వు కూడా అలాగే చేయొచ్చు
కదా.. స్త్రీ పురుషులిప్పుడు సమానమయ్యారు కదా అనడంలేదు...’
‘నీకు చెప్పకపోయి వుంటే వారం క్రితంలాగే ఇవాళ కూడా నేను పతివ్రతను. చెప్పడం వలన పతితను.
నీకేం కావాలి నిజమా... ఆ పతివ్రతా?’ అని అడుగుతూనే... ‘ఘనమైన ప్రేమ ఒక్క తప్పిదాన్ని
క్షమించలేదా?’ అని వేడుకుంటుంది. ఈ స్టేట్ మెంట్స్ అన్నీ చూస్తే... కమలిని పాత్ర చిత్రణలోనే పరస్పర
విరుద్ధమైన వాదన, కొంత అస్పష్టత ద్యోతకమౌతోంది.
అంటే... తాను తప్పు చేశాననే భావన ఇక్కడ కమలినిలో వ్యక్తమౌతోంది. సెక్స్ అనేది స్త్రీ పురుషుల మధ్య
ఒక సాంఘిక చర్య. అది ఆ ఇద్దరి మధ్య ఉన్న అవగాహన, ఇష్టం, వారి మధ్యనున్న అనుబంధం బట్టి
ఉంటుంది. తాను తప్పు చేశాననే భావనకు గురైనప్పుడు... అసలు స్త్రీ పురుష సమానత్వం గురించిన
వాదనకు తావెక్కడుంది. ఒకవైపు తాను తప్పు చేశానని ఒప్పుకుంటూనే, పురుషుల్లో ఎక్కుమంది
తప్పు చేస్తున్నారు, అయినా భార్యలు అంగీకరిస్తున్నారు. కాబట్టి నా తప్పుని నువ్వూ క్షమించు అనే
వాదన కరెక్టేనా? అలాకాకుండా... ఇదొక బలహీన క్షణంలో జరిగిన చర్య. కథలో చెప్పినట్లుగా ఆకర్షణలకు
లోనవడం వల్ల జరిగిన పొరబాటు. దాన్ని మళ్లీ జరగకుండా చూసుకోవడం ద్వారా తన నైతికతను,
వ్యక్తిత్వాన్ని నిలుపుకోవచ్చు. ఇదే విషయాన్ని కమలిని ఫ్రెండ్ కూడా చెబుతుంది. ఇదే సందర్భంలో
పురుషుల వైపునుండి వాదనను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కథలో చెప్పినట్టుగా అన్నిరకాల
ఆర్గ్యుమెంట్స్ ని చేయొచ్చు.
మొత్తంగా చూసినప్పుడు... రచయిత్రి లైంగికత వంటి ఒక సున్నితమైన అంశాన్ని కథావస్తువుగా
తీసుకున్నప్పుడు పాత్ర చిత్రణలోనూ, వినిపించే వాదనలోనూ ఒక స్పష్టత, పరిపూర్ణత అవసరం. ఈ కథ
ద్వారా ఎలాంటి సందేశం ఇచ్చాం అనేది ముఖ్యం.



No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates