Social Icons

Tuesday, April 19, 2016

నాతో కలిసి మళ్లీ నలుగురం..

అది 80వ దశకం...
అత్యంత ఉల్లాసంగా గడిపిన మా స్కూలు రోజులు...
ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన జ్ఞాపకాలు...
ఆ జ్ఞాపకాల్లో 2వ నెంబర్ సిటీ బస్ కు కూడా ఎంతో ప్రాధాన్యతుంది.
మా పక్క గ్రామం కొక్కిరిపాడు నుంచి ఏలూరు వచ్చే ఆ సిటీ బస్సులో
పొద్దున్నే 8.30కి స్కూళ్లకి వెళ్లేవాళ్ళం.
మా చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలనుంచి వచ్చే విద్యార్థులంతా ఆ బస్సు ఎక్కేవారు

అప్పట్లో పిల్లలకు 15పైసలు ఛార్జి అన్నట్టుగా గుర్తు..
అదే బస్సులో కొక్కిరిపాడు నుంచి డాన్ బోస్కో స్కూలుకు
నాతోపాటు వచ్చే నలుగురు అక్కా చెల్లెళ్లు  కూడా నా జ్ఞాపకాల్లో భాగమే...
స్కులుకు వెళ్లేటప్పుడు.. తిరిగొచ్చేటప్పుడు బస్సులో అంతా సరదా సరదాగా వుండేది.
ఒక్కటే అల్లరి... చిన్న చిన్నగొడవలు.. అలకలు.. సర్దుబాట్లు...
భలే మజాగా వుండేదా ప్రయాణం.
ఆ నలుగురు అక్కా చెలెళ్లలో అందరిలోనూ చిన్నది..
బక్కపలచనిదైనా చక్కనైనది... చురుకైనది.
బాదంకాయ వంటి పెద్దపెద్ద కళ్లతో ఇట్టే ఆకర్షించే ఆ పిల్లే... జాజి.
ఆ చిన్నారి జాజిమల్లి... కాలక్రమానా జగమెరిగిన రచయిత్రి కెఎన్ మల్లీశ్వరిగా ఎదిగి
మమ్మల్నందరినీ  ఆనందాశ్చర్యాలతో ముంచేసింది.
మల్లీశ్వరి కథలు, ఆ కథల్లోని పాత్రల్లో చాలావరకు 
మనచుట్టూ వుండే వ్యక్తులు, ప్రదేశాలు, ప్రాంతాలు కనబడతాయి.
జీవితంలో మన చుట్టూ తారసపడే వ్యక్తులు.. ఘటనలే  ఆవిడ కథావస్తువులోని
పాత్రధారులు.
అందుకే... తాను సృష్టించిన పాత్రలు  మన కళ్లముందు సజీవంగా అగపడతాయి.
సునిశిత పరిశీలన... లోతైన భావ వ్యక్తీకరణ మల్లీశ్వరి ప్రత్యేకత.

ఈమధ్య అనుకోకుండా మల్లీశ్వరితో మాట్లాడడం తటస్థించినప్పుడు
‘పెద్దక్క ప్రయాణం’ పుస్తకం పిడిఎఫ్ లింక్ ను పంపించారు.
ఎంతో ఆతృతగా ఆసాంతం చదివాను. చదవడం పూర్తయ్యే సరికి
మనసంతా బాధతో నిండిపోయింది.
మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన ఎన్నో జ్ఞాపకాలు
ఒక్కసారిగా ఉప్పెనలా ఎగసిపడ్డాయి.
తడి ఆరని ఆ జ్ఞాపకాలు... ఇంకా పచ్చిగానే వున్నాయి...
పుస్తకం చదువుతున్న సేపు...
ఆ నలుగురు అక్కాచెల్లెళ్లతో నా అనుబంధాన్ని నెమరు వేసుకున్నా...
చిన్ననాటి రూపాలు కనులముందు తారాడసాగాయి..
పెద్దక్క జ్ఞాపకాలను అక్షరాలుగా పోగేసి... పుస్తక రూపంగా మలచి
ఆమెను పునర్జీవింప చేసిన ముగ్గురు చెల్లెళ్ల ఆశయం అత్యున్నతం.
ఈ పుస్తకం చదువుతుంటే కొన్నిచోట్ల కన్నీళ్లను ఆపుకోలేకపోయాను.
ఎందుకంటే... మా అక్క కూడా ఇలాగే కేన్సర్ తో  చనిపోయింది.
తన జ్ఞాపకాలు ఎప్పటికీ నా వెన్నంటి ఉండే మధుర స్మృతులు...
అందుకేనేమో.. పెద్దక్క ప్రయాణం పుస్తకం నన్నంతగా కదిలించింది.
ఏ మనిషికైనా తన చావు ముందే నిర్ణయమైతే..
ఆ విషయం తెలిసి కూడా ఎంతో స్థితప్రజ్ఞత ప్రదర్శించడం
అందరికీ సాధ్యపడే విషయం కాదు. ఏ కొద్దిమందికో తప్ప...
మరణం నెలల్లోనే అని తెలిసినా....
తన చుట్టూ ఉన్నవారితో ఎంతో నిబ్బరంగా వ్యవహరించడం పెద్దక్క  ఔన్నత్యం.
పెద్దక్క చివరి దశలో ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తనను సాధ్యమైనంత వరకు
సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించడం వారి సంస్కారానికి నిదర్శనం.
జాజీ... నలుగురు అక్కాచెల్లెళ్లు ముగ్గురయ్యారని  ఎప్పుడూ బాధపడొద్దు...
నాతో కలిసి మళ్లీ నలుగురం... నలుగురు అక్కాచెల్లెళ్ళం...
ఎక్కడవున్నా పెద్దక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...

https://jajimalli.wordpress.com/

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates