Social Icons

Monday, April 25, 2016

సుస్వరాల జానకమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

‘పగలే వెన్నెల... జగమే ఊయల..’ అంటూ తన గొంతులో చల్లటి వెన్నెలలు కురిపించగరు..
‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన
గోధూళి ఎర్రనా ఎందువలన?’
అంటూ.
ముద్దుముద్దుగానూ పాడగలరు..
అది ఏ పాట అయినా..
ఏ రాగమైనా..
ఏ భాష అయినా..
మధురాతి మధురంగా ఆలపించగల
స్వర సుధామయి.. గాన రసమయి


మన తెలుగింటి ఆడపడుచు..
ఎస్.జానకి గారు.
నేడు వారి జన్మదినం... సంగీత ప్రియులకు పర్వదినం...

ఏప్రిల్ 23,1938లో గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపే జానకి గారు తన మూడవ ఏటనే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితులయ్యారు. లతామంగేష్కర్‌, పి.సుశీల, జిక్కీ, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేవారు. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి  తన 18వ ఏటనే సినీ గాయనిగా కెరీర్ ప్రారంభించారు.

      హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి... ఘంటసాల, డాక్టర్ రాజ్‌కుమార్, వాణి జయరాం, కెజె.జేసుదాస్, ఎల్ఆర్.ఈశ్వరి, పి.జయ చంద్రన్, పి.లీలా, కెఎస్.చిత్ర, సుజాత, జెన్సీ, పిబి.శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి.బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో కలిసి ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు. ఎంతటి రాగమైన అతి సులభంగా పాడగలరు.
ఒక గాయని 55 ఏళ్ళపాటు పాటలు పాడుతూ శ్రోతలను అలరించడం మామూలు విషయం కాదు. అంత సుదీర్ఘమైన నేపథ్య గాన జీవితంలో కడదాకా ఒకే విధంగా ఆలపించడం ఇంకా కష్టం. ఐదారు తరాల హీరోయిన్లకి గొంతు అరువిచ్చి ఒప్పించడం, వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం... ఇవన్నీ అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు. అది ఒక్క జానకి గారికే సాధ్యమని నిస్సందేహంగా చెప్పొచ్చు. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్‌ ఎదురులేకుండా సాగింది. వేలకొద్దీ పాటలు పాడారు. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మెలోడీ సాంగ్స్ నుండి కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్ వరకు అన్నిరకాలూ పాడగలిగిన జానకి గళం... సంగీత ప్రియులకు వరప్రసాదమే.

       నాలుగుసార్లు జాతీయ పురస్కారం, కేరళ,తమిళనాడు, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతోపాటు
మన రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డును 10సార్లు అందుకోవడం వారి ప్రతిభకు తార్కాణం.
ఇదేకాకుండా ఫిలింఫేర్ వంటి అనేక అవార్డులు వారిని వరించాయి. 2013లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించినప్పటికీ దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. ఇది ఆమె ఆత్మాభిమానానికి నిదర్శనం.
మరోసారి ఆ మహాగాయనికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు....

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates