Social Icons

Monday, April 18, 2016

కందుకూరి స్ఫూర్తి నేటి తరానికి కావాలి దిక్సూచి

April 16 at 11:21am

గొప్ప సాహితీ వేత్త, సంస్కర్త...
వితంతు వివాహాలు నిర్వహించిన మహనీయుడు...
బాలికల కోసం ప్రత్యేకంగా ఒక విద్యాలయాన్ని ప్రారంభించిన అభ్యుయవాది...
కందుకూరి వీరేశలింగం పంతులు గారి పుట్టినరోజు.
1848 ఏప్రిల్ 16న సుబ్బారాయుడు, పూర్ణమ్మ దంపతులకు రాజమహేంద్రవరంలో జన్మించారు.
ఆ రోజుల్లో సమాజంలో ఉన్న మూఢ ఆచారాలు వీరిని కలచివేసాయి. ముఖ్యంగా స్త్రీల సమస్యలు వీరిని ప్రభావితం చేసాయి. సంఘ సంస్కరణకు నడుం బిగించారు. వితంతు వివాహాలు నిర్వహించటం, బాల్య వివాహాలు నిరోధించటం వీరి సంస్కరణలోని ముఖ్యాంశాలు. స్త్రీలకు విద్య నేర్పించక పోవటమే ఈ దురాచారాలకు కారణమని భావించి ధవళేశ్వరంలో 1874 బాలికల కోసం ప్రత్యేకంగా ఒక విద్యాలయాన్ని ప్రారంభించారు.

సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసారో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపారు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసిన ఆయన, పత్రికలకు పలు వ్యాసాలు రాస్తుండేవారు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవారు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవారు కందుకూరి. 130కి పైగా గ్రంథాలు వ్రాసారు. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. బడి పిల్లల కొరకు వాచకాలు రచించారు. ఆంధ్ర కవుల చరిత్ర ను కూడా ప్రచురించారు. సంగ్రహ వ్యాకరణం రాశారు. నీతిచంద్రిక (తెలుగు పంచతంత్రం) లోని సంధి, విగ్రహం భాగాలను చిన్నయసూరి వదిలివేయగా వీరేశలింగం పూర్తి చేసారు.
1876లో ఒక తెలుగు పత్రికను ప్రారంభించి, ఆ పత్రికలో స్త్రీల సమస్యలను గురించి అనేక వ్యాసాలు రాశారు.
ఆ తరువాత వీరు 'వివేక వర్ధిని' అనే పత్రికను స్థాపించి తన ఉద్యమానికి ఊతగా ఆ పత్రికను నడిపారు. సంస్కరణకు సంబధించిన వ్యాసాలతో పాటు, సమాజంలోని దురాచారాలను, అవినీతి, కల్మషాన్ని తన రచనా వ్యాసంగంతో కడిగివేసారు. ఆ రోజుల్లో ఆ పత్రిక మద్రాసు నుండి ముద్రించబడేది. ఆ పత్రికకు అనతికాలంలోనే విశేష స్పందన వచ్చింది. ఆ పరిస్థితుల దృష్ట్యా పంతులు గారు రాజమహేంద్రవరంలోనే తన సొంత ముద్రణాలయాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లోనే వీరు స్త్రీలను చైతన్య పరచటానికీ, వారికున్న హక్కులు తెలియచేసి వారిని జాగృత పరచటానికి 'సతిహితబోధిని' అనే మరో పత్రికను కూడా ప్రారంభించినారు. 1878లో దేవదాసీ, భోగం మేళం లాంటి దురాచారాలను ఎండగడుతూ(anti-nautch movement ) తీవ్రమైన ఉద్యమాలు చేసారు. వితంతు వివాహాలు వీరి ఆధ్వర్యంలో విరివిగా జరగటం మొదలయ్యాయి. 11-12-1881 న వారు గోగులపర్తి శ్రీ రాములు, గౌరమ్మ అనే వారికి మొదటి వితంతు వివాహం జరిపించారు. కందుకూరి స్ఫూర్తి నేటి తరానికి దిక్సూచి కావాలి.

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates