Social Icons

Thursday, March 31, 2016

‘మాయాబజార్’లో ‘నీవేనా నను తలచినది’ పాట 59ఏళ్ల అద్భుతం...


‘మాయాబజార్’ సినిమా విడుదలైన నేటికి 59ఏళ్లు. తెలుగు, తమిళ భాషలలో విజయ ప్రొడక్షన్స్‌వారు అందించిన దృశ్యకావ్యం ఈ మాయా బజార్!
తెలుగులో 27మార్చి, 1957, తమిళంలో 12ఏప్రిల్, 1957,
రంగుల్లోకి మార్చిన తర్వాత 30జనవరి, 2010న విడుదలయ్యింది.
ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో గొప్పగొప్ప రివ్యూలు వచ్చాయి.


అయితే ఈ సినిమాలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నచ్చేపాట...
‘నీవేనా నను తలచినది...’.
ఆ పాటలోని సాహిత్యము, ఆ చిత్రీకరణ ఎంత అద్భుతంగా వుంటాయంటే...
ఇప్పటికీ ఆ పాట విన్నా, చూసినా అబ్బురపడిపోతాను.
అసలు కంప్యూటరంటే తెలియని రోజుల్లో, ప్రియదర్శిని అన్న పేటికలో
ఇష్టమైన వారిని చూడవచ్చు అనే కల్పన ద్వారా
అభిమన్యుడు(నాగేశ్వరరావు), శశిరేఖ (సావిత్రి)
‘నీవేనా నను పిలచినది... నీవేనా నను తలచినది..
నీవేనా నా మదిలో నిలచీ హృదయము కలవర పరచినది... నీవేనా...’ అంటూ
యుగళ గీతం పాడేస్తారు. సముద్రాల (సీనియర్) సాహిత్యానికి ఘంటసాల, పి.లీల తమ

అద్భుతమైన గాత్రాన్ని అందించారు.
అయితే... నాకిప్పటికీ ఆశ్చర్యంగా అనిపించేదేమిటంటే...
‘బావ పంపిన కానుక తల్లీ... నీకు ఇష్టమేనా’ అంటూ
శశిరేఖకు కృష్ణుడు ప్రియదర్శిని అనే పేటికను ఇస్తాడు.
తమకు ఇష్టమైన వారిని తలచుకొని ఆ పేటికను తెరచి చూస్తే... అందులో వారు కనిపిస్తారు.
శశిరేఖకు ఆ పేటికను తన గదిలోకి తెచ్చుకొని
తనకిష్టమైన అభిమాన్యుడ్ని తలచుకొని ఆ పేటికను తెరుస్తుంది. అలా తీయగానే...
‘నీవేనా... నీవేనా నను పిలచినది.. నీవేనా నను తలచినది’ అంటూ
అభిమన్యుడు శశిరేఖను ఆహ్వానిస్తూ కనిపిస్తాడు.
ఇది ఎంత సందర్భోచితమైన సన్నివేశం అంటే...
ఇన్నేళ్లలో ఇలాంటి సందర్భోచితమైన సన్నివేశం మరోటి నాకు తారసపడలేదంటే అతిశయోక్తి కాదు.
ఆ పేటికలో అభిమన్యుడు ‘నీవేనా... నీవేనా నను పిలచినది’ అనగానే
చూస్తునశశిరేఖఒక్కసారిగా ఆశ్చర్యం.. ఆనందం... వెనువెంటనే సిగ్గులమొగ్గై తనను తాను
మైమరిచిపోవడం... ఆ సన్నివేశం చూస్తున్న ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది.
‘కలలోనే ఒక మెలకువగా...
ఆ మెలకువలోనే ఒక కలగా...
కలయో నిజమో వైష్ణవమాయో...
తెలిసి తెలియని అయోమయంలో...’ అని అభిమన్యుడంటే..
‘కనుల వెన్నెల కాయించి...
నా మనసున మల్లెలు పూయించి.
కనులను మనసును కరిగించి...
మైమరపించి.. నన్నలరించి...’ అంటూ శశిరేఖ పాడుతుంది.
తన మనసులో ప్రియుడ్ని తలచుకోగానే ‘నీవేనా నను పిలిచింది’ అని ఆయన రావడం,
అలా రావడానశశిరేఖఎంత ఆస్వాదిస్తోందంటే...
కళ్లలో వెన్నెల కాయించి, మనసులో మల్లెలు పూయించి, మైమరపించావని
ఆనంద పారవశ్యంలో తేలిపోవడం....
తానెంత భావోద్వేగానికి గురవుతుందో తెలియజేసేందుకు
పరవళ్లుతొక్కుతున్న అలలను సింబాలిక్ గా చూపించడం.... వావ్..
ఎంత అద్భుతమైన భావనో కదా...
అంత అద్భుతంగాను సావిత్రి నటన వుంటుంది.
తను కళ్లతో పలికించే ఆ భావాన్ని... అంతే భావస్ఫోరకంగా..
వర్ణించడం ఎవరికైనా సాధ్యమా అనిపిస్తుంటుంది.
అందుకే ఈ పాట ఎప్పటికీ ఓ అద్భుతమే నాకు.
ఇక సినిమాలో శశిరేఖ పాత్రధారి సావిత్రిపై ‘నీవేనా నను తలచినది...’ పాటను చిత్రీకరిస్తున్నప్పటి స్టిల్
కూడా ఫొటోల్లో జత చేశాను. సావిత్రి అభినయిస్తుండగా దర్శకుడు కె.వి.రెడ్డి (కుర్చీలో),
ఛాయాగ్రాహకుడు మార్కస్‌బార్‌ట్లే తదితరులు పరిశీలిస్తున్న అపురూపమైన స్టిల్ ఇది!

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates