Posted: August 26, 2016
//దర్శక శిఖరం... కైలాసం బాలచందర్//
సినిమా అంటే కేవలం రెండుగంటల కాలక్షేపం కాదు..
పెద్దపెద్ద హీరోలు, ఆర్భాటపు సెట్టింగులు.. ఫైట్లు, డ్యూయెట్లు కాదు...
సమాజాన్ని విశ్లేషించాలి... సమాజ అంతరంగాన్ని దర్శించగలగాలి...
జీవితాన్ని ప్రతింబింబించాలి..

మానవ మనస్తత్వాల వైచిత్రిని సునిశితంగా తడమాలి...
మానవ సంబంధాల్లోని విభిన్నకోణాలను స్పృశించాలి...
గుండెలోతుల్లోని భావాలను తట్టిలేపాలి...
ఈ క్వాలిటీస్... వున్న రచయిత... దర్శకుడు కె.బాలచందర్.
దర్శక శిఖరం... పద్మశ్రీ, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత కైలాసం బాలచందర్.
ఆయన 45 ఏళ్ల సినీజీవితంలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో
100కు పైగా చిత్రాలను రూపొందించాడు.
రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని పరిచయం చేశాడు.
‘ఇది కథ కాదు, అంతులేని కథ , 47 రోజులు , ఆకలి రాజ్యం, మరోచరిత్ర , గుప్పెడు మనసు,
సింధుభైరవి, తొలి కోడి కూసింది’ వంటి ఎన్నో మరపురాని చిత్రాల్లో...
మరెన్నో జీవితాలను, విభిన్న దృక్పథాలను వెండితెరపై ఆవిష్కరించారు.
బాలచందర్ తీసిన గొప్ప సినిమాల్లో ‘గుప్పెడు మనసు’ ఒకటి.
ఇందులో స్త్రీ హృదయాన్ని, సంఘర్షణను అద్బుతంగా చిత్రీకరించాడు బాలచందర్.
అలాంటిదే మరో సినిమా ‘కోకిలమ్మ’.
ఇంటింటికీ తిరిగి అంట్లు తోముకునే ఓ పేద స్త్రీ జీవితం ఈ సినిమా.
ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించే సున్నితమైన ప్రేమకథ ఇది.
మరో ముఖ్యమైన సినిమా సింధుభైరవి...
ఈ సినిమా కర్నాటక సంగీత నేపథ్యంలో సాగినా... దీంట్లోనూ ఓ స్త్రీ అంతరంగాన్ని చూపించాడు.
ఇక పెద్ద స్టార్లతో తీసిన ‘ఆకలి రాజ్యం’, ‘రుద్రవీణ’.
ఒకదానిలో ఆకలి బాధ, నిరుద్యోగం ఎంత భయంకరంగావుంటుందో చూపితే...
మరోదానిలో సమాజ ప్రయోజనం కోసం ఓ యువకుడు తపనను ఇతివృత్తంగా తీసుకున్నాడు.
బాలచందర్ సినిమాల విశ్లేషణా కార్యక్రమం పెట్టుకోలేదుగానీ..
‘అంతులేని కథ’ సినిమా చూసి బాలచందర్ దర్శక ప్రతిభను మరోసారి మిత్రులందరికీ
జ్ఞాపకం చేయాలనే చిన్న ప్రయత్నం...
***
ఈమధ్య చూసిన సినిమాల్లో ‘అంతులేని కథ‘ ఒకటి. ఇందులో దర్శకుడు కె.బాలచందర్ టేకింగ్
అద్భుతంగా వుంటుంది. ఒక మధ్య తరగతి కుటుంబంలోని విభిన్న మనస్తత్వాల విశ్లేషణే ఈ
సినిమా. చాదస్తాలతో డబ్బు తగలేసే వారికోసం ఉద్యోగం చేస్తూ ఒక దృఢమైన అమ్మాయి
అనుభవించే యాతనలపై సాగిన చిత్రం. బాలచందర్ దర్శకత్వం ప్రతిభకు..., కథన కౌశలానికి
నిదర్శనం ఈ సినిమా. ఏ మాత్రం స్టార్ వాల్యూ లేని ఈ చిత్రం సూపర్ హిట్ అయిందంటే అది కేవలం
దర్శకుని ప్రతిభే తప్ప మరొకటి కాదు. ప్రతి పాత్రను ఎంతో సున్నితంగా మలిచారు. తనకూ ఓ
కుటుంబం ఉన్నా... పనిపాట లేకుండా చెల్లెలిపై ఆధారపడే పాత్రలో రజనీకాంత్, కుటుంబం పట్ల
కనీస బాధ్యతలేని అన్నను ఒక మగాడిగా కూడా గుర్తించకుండా... నిర్లక్ష్యంగా వ్యవహరించే పాత్రలో
జయప్రద అద్భుతంగా నటించారంటే... ఆ పాత్రలను అంత అద్భుతంగా మలిచిన బాలచందర్ కే ఆ
క్రెడిట్ దక్కుతుంది.
ఇక ఈ సినిమా మొత్తం విశాఖపట్నంలోనే చిత్రీకరించారు. పెద్ద పెద్ద సెట్టింగులు... ఫైట్లు...
డ్యూయెట్లు, హడావుడి లేకుండా తీసిన సినిమా ఇది. పైగా బ్లాక్ అండ్ వైట్. అయినా అప్పుడూ...
ఇప్పుడూ ప్రేక్షకాదరణ పొందిందీ అంటే... అది కేవలం బాలచందర్ వల్లనే అని ఘంటాపథంగా
చెప్పొచ్చు. ఇప్పు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న రజనీకాంత్ కు.. ఆ సినిమాకు
1000 రూపాయల పారితోషికం ఇచ్చారట.

బాలచందర్ సిమాల్లోకి అడుగుపెట్టేనాటికి సినిమాలన్నీ ఒకవైపు సత్యజిత్ రే, మృణాల్ సేన్ ,
శ్యాంబెనెగళ్ వంటి దర్శకులు పూర్తిగా ఆర్ట్ సినిమాలు తీస్తుంటే...
మరోవైపు హీరోయిజంతో నిండిన కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతుండేవి.
ఇటువంటి కీలకమైన సమయంలో సినీప్రవేశం చేసిన బాలచందర్.. మధ్యతరగతి కుటుంబాలను, వారి
ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు.
అందుకే ఆయన సినిమాల్లోని పాత్రలు వాస్తవికతకు ప్రతిబింబాలుగా ఉంటాయి.
స్టార్ హీరోలతో సినిమాలు చేసినా... కథే ఆయన సినిమాలో హీరోగా వుంటుంది.
సామాజిక సమస్యలను, నాటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను
ఇతివృత్తాలుగా తీసుకొని అద్భుతమైన కళాఖండాలను సృష్టించిన బాలచందర్
అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ... చిర్మస్మరణీయులే...

No comments:
Post a Comment