‘స్నేహం అనేది రెండు దేహాల్లో ఉండే ఒకే ఆత్మ...’ అంటారు అరిస్టాటిల్...
స్నేహం గురించి ఎందరో ప్రముఖులు అనేక నిర్వచనాలు చెప్పారు.
సృష్టిలో తీయనిది
అందమైనది
అంతంలేనిది
అనునిత్యం తోడుగా వుండేది
స్నేహం...
తరగతి గదుల్లోనే మొగ్గ తొడిగి
వయసుతో పాటు వికసించి
జీవితానంతరం కూడా పరిమళించి
ఒక పరిచయాన్ని శాస్వతం చేసేది
‘స్నేహం’....
స్నేహంలేని జీవితం.. హృదయంలేని శరీరం లాంటిది
స్నేహం ఒక అనిర్వచనీయమైన అనుభూతి
స్నేహాన్ని గురించి, ప్రేమను గురించి ఎందరో కవులు ఎన్నో రచనలు చేశారు.
ఎన్ని రచనలు చేసినా, కవితలు రాసిన.... పదాలు... అర్థాలు ఒక్కటే....
అయినా.. ఎప్పుడూ కొత్తగానే వుంటాయి...
ఎన్నిసార్లు చదివినా అప్పుడే చదివినంత తాజాగా వుంటాయి...
స్నేహంలోని మాధుర్యం కూడా అంతే...
మధువు పాతపడే కొద్ది రుచి పెరిగినట్టు... స్నేహం కూడా అంతే...
అదే స్నేహంలోని గొప్పతనం.
రక్త సంబంధాలకు... భార్యాభర్తల అనుబంధాలకు అతీతమైనది...
వాటన్నిటికన్నా అందమైనదీ, అపురూపమైనదీ, అద్భుతమైనదీ, అత్యున్నతమైనదీ
స్నేహం మాత్రమే.
***
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం
జరుపుకుంటారు. తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ
స్నేహితులతో గడుపుతారు. 1935 లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి
ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజు గా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ
స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు
స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి.
***
అక్కా... నేను... తమ్ముడు...
మాకు తోడు మా ముగ్గురి ఫ్రెండ్స్.... అదొక పెద్ద గ్యాంగ్...
చదువుతో పాటు... ఆటలు, పాటలు.. గిల్లికజ్జాలు... మూతి బిగింపులు..
మళ్లీ అప్పటికప్పుడే భుజాలపై చేతులేసుకొని ఒక్కటే కబుర్లు...
అదే స్నేహంలోని స్వచ్ఛత.
వయసు పెరిగేకొద్దీ... వాళ్ల వాళ్ల అభిరుచులను బట్టి
కొత్త కొత్త స్నేహితులు పరిచయమవుతూనే వుంటారు...
‘శత్రువు ఒక్కడైనా ఎక్కువే... మిత్రులు వంద అయినా తక్కువే..’ అని
వివేకానందుడు చెప్పినట్టుగా ఎందరు స్నేహితులున్నా తక్కువే.
ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా...
చిన్ననాటి నుంచి ఇప్పటివరకూ వున్న నా స్నేహితులందరికీ
పేరు పేరునా శుభాకాంక్షలు....

No comments:
Post a Comment