Posted: September 25, 2016
‘ఆ 18 మంది’....
ఆ ఉషోదయం వేళ దేశాన్ని కుదేపేసిన ఓ ఉగ్రదారుణం
హృదయాలను కలచివేసిన ఓ దుస్సంఘటనం
ప్రతీకారేచ్ఛతో రక్తం మరిగిపోయిన క్షణం
అది పాక్ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన రక్తపాతం
స్రవిస్తోన్న భరతమాత రుధిరం
ఎగసిపడుతోన్న వీరజవానుల రకతం
మీకండగా మేమున్నామంటూ ఎలుగెత్తిన జనభారతం
***
యురిలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవానుల నుద్దేశించి
ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఎండ్లూరి సుధాకర్ గారు రాసిన కవిత
‘ఆ 18 మంది’.
హృద్యంగా... ఆగ్రహంగా... ఆవేదనగా
మనసును మెలిపెట్టింది.
వారు అంత అద్భుతంగా రాశారు.
‘ఈ మృత్యు చరిత్ర పునరావృతం కావొద్దు
ఈ దుఃఖం ద్విగుణీకృతం కావొద్దు ’ అంటూ
‘సైనికులు లేని
దేశాలు కావాలనీ
సరిహద్దులు లేని
సమాజాలు రావాలని
శత్రువులు లేని
స్నేహ స్థావరాలు వుండాలని’ ఆకాంక్షను
సుధాకర్ గారు తన కవితలో వ్యక్తం చేశారు.
ఆసేతు హిమాచలం... అఖండ భారతావనిలో
శాంతిసౌరభాలు వికసించాలని
ఉగ్రవాదంలేని నవభారతం ఆవిర్భవించాలని
కోరుకుందాం...
ఇంతటి మంచి కవిత రాసిన సుధాకర్ గారికి అభినందనలు.
‘ఆ 18 మంది’....
ఆ ఉషోదయం వేళ దేశాన్ని కుదేపేసిన ఓ ఉగ్రదారుణం
హృదయాలను కలచివేసిన ఓ దుస్సంఘటనం
ప్రతీకారేచ్ఛతో రక్తం మరిగిపోయిన క్షణం
అది పాక్ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన రక్తపాతం
స్రవిస్తోన్న భరతమాత రుధిరం
ఎగసిపడుతోన్న వీరజవానుల రకతం
మీకండగా మేమున్నామంటూ ఎలుగెత్తిన జనభారతం
***
యురిలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవానుల నుద్దేశించి
ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఎండ్లూరి సుధాకర్ గారు రాసిన కవిత
‘ఆ 18 మంది’.
హృద్యంగా... ఆగ్రహంగా... ఆవేదనగా
మనసును మెలిపెట్టింది.
వారు అంత అద్భుతంగా రాశారు.
‘ఈ మృత్యు చరిత్ర పునరావృతం కావొద్దు
ఈ దుఃఖం ద్విగుణీకృతం కావొద్దు ’ అంటూ
‘సైనికులు లేని
దేశాలు కావాలనీ
సరిహద్దులు లేని
సమాజాలు రావాలని
శత్రువులు లేని
స్నేహ స్థావరాలు వుండాలని’ ఆకాంక్షను
సుధాకర్ గారు తన కవితలో వ్యక్తం చేశారు.
ఆసేతు హిమాచలం... అఖండ భారతావనిలో
శాంతిసౌరభాలు వికసించాలని
ఉగ్రవాదంలేని నవభారతం ఆవిర్భవించాలని
కోరుకుందాం...
ఇంతటి మంచి కవిత రాసిన సుధాకర్ గారికి అభినందనలు.
No comments:
Post a Comment