Social Icons

Monday, September 26, 2016

స్వరమాంత్రికుడు పిబి శ్రీనివాస్

Posted: September 22, 2016

//స్వరమాంత్రికుడు పిబి శ్రీనివాస్//
వాగ్గేయకారుడనే పదానికి స్వచ్ఛమైన ఉదాహరణ ఆయన..
తెలుగునాట పుట్టి... కన్నడిగులను మెప్పించి...
తమిళ, మలయాళ, హిందీ, ఉర్దూ భాషల్లోనూ రాణించి...
అశువుగా పద్యాలు.. పాటలు రాసి... అలవోకగా గజల్స్ పాడి...
సంగీతాభిమానుల మనసుదోచిన గాన గంధర్వుడు...

సంగీతం ఆయన తూణీరంలో ఒక పార్శ్వం మాత్రమే.
విలక్షణమైన స్వరం.. వినసొంపైన గానం ఆయన స్వంతం..
‘ఓహో గులాబి బాల... అందాల ప్రేమమాల..
సొగసైన కనులదానా... ఇంపైన మనసుదానా...
నీవాడెవరో తెలుసుకో...’ అంటూ తన స్వర మాధుర్యంతో జీవం పోసిన స్వరమాంత్రికుడు
ఆయనే పి.బి.శ్రీనివాస్ (ప్రతివాది భయంకర శ్రీనివాస్).
నేడు (గురువారం) పిబి శ్రీనివాస్ పుట్టినరోజు.
***
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22, 1930 న
జన్మించాడు. ఆయన కళాశాల చదివి బి.కాం. చదివారు. ఆయన పూర్వీకులు పసలపూడికి చెందినవారు.
తెలుగు, కన్నడం , తమిళం , మళయాళం , హిందీ , ఉర్దూ , ఆంగ్లం , సంస్కృతం...
ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగల దిట్ట పిబి.
ఆర్.నాగేంద్ రావు ‘జాతక ఫలం’ చిత్రం ద్వారా తమిళం, కన్నడం, తెలుగు చిత్రాలలో పరిచయమైనాడు.
ఆయన తెలుగువాడైనప్పటికీ ఎక్కువ పాటలను కన్నడంలోనే పాడారు.
అంతేకాదు... తెలుగులో లేని కొత్త ఛందస్సు కనుగొని ‘శ్రీనివాస గాయత్రీ వృత్తాలు’ పేరిట
ఓ పుస్తకాన్నే ప్రచురించారంటే... సాహిత్యం పట్ల ఆయనకెంత మక్కువో తెలుస్తుంది.
అన్ని భాషల సినిమాలు చూడడం... పాటలు విని స్వరాలు రాసుకుని సాధన చేయడం ఆయన అలవాటు.
పాటలు పాడటమే కాకుండా ఉర్దూలో గజల్స్‌, ఇంగ్లీషులో కవితలు కూడా రాసి మెప్పించారు.
నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై కాలిడిన సందర్భంలో ఇంగ్లీషులో ‘మేన్‌ హాజ్‌ సెట్‌ హిజ్‌ పూట్‌ ఆన్‌ ది మూన్‌’ అనే పాట
రాసి కంపోజ్‌ చేశారు.
రవీంద్రనాథ్‌ ఠాగూర్ శతజయంతి సందర్భంగా శాంతినికేతన్‌ వారు టాగూర్‌పై కొన్ని పాటలు రికార్డు చేయించుకున్నారు.
కొన్నాళ్ళు జర్నలిస్టుగా కూడా పనిచేశారు.
***
పి.బి.శ్రీనివాస్‌... పేరు వింటే చాలు.
సింధు భైరవి రాగానికి కొత్త శోభ వస్తుంది.
హిందోళంలోని భక్తి, శృంగార, కరుణ రసాలు తమ ఆరోహణ ఆవరోహణ నియమాలను వదిలి
ఆనందడోలికల్లో మునిగితేలుతూ దారి తప్పుతాయి.
మోహన కల్యాణి, అభేరి రాగాలు కొత్త ఉత్సహంతో పరుగులెత్తుతాయి.
ఆయన గళం విప్పితే కలం కొత్త పదాలు వెతుక్కోవలిసి వస్తుంది.
సంగీత సాహిత్యాలకు ఓ కొత్త వెలుగువస్తుంది.
పిబి స్వరంలో పాట పునీతమౌతుంది.
పిబి శ్రీనివాస్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ...
ఆయన గానాసుధా రాగాలను తనివితీరా ఆస్వాదిద్దాం...

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates