Posted: July 15, 2016
నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాలి.
పురుషాధిక్య సమాజంలో స్త్రీల అణచివేత,స్త్రీలపై జరుగుతున్న అరాచకాలకిదో మచ్చుతునక.
భార్యపై అనుమానంతో శీల పరీక్ష పెట్టాడో మృగాడు.
ఈ మృగాడికి వంతపాడారు గ్రామ కుల పెద్ధలు.
వాళ్లూ మగాళ్లే కదా...
***
ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు...
విజయవాడకు కూతవేటు దూరంలో జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లులో..
బాలకృష్ణ అనే మృగాడు తన భార్య తిరుపతమ్మను అనుమానించాడు.
విషయాన్ని కులపెద్ధల ముందు పంచాయితీ పెట్టాడు.
అది నమ్మిన పెద్దలు శీల పరీక్షకు ఏర్పాటు చేశారు.
బాగా ఎర్రగా కాల్చిన కడ్డీని పట్టుకోవాలని..
చేతులు కాలకపోతే తను శీలవతి అని...
చేతులు కాలితే శీలవతి కాదని..
ముందుగా తాను ఒప్పుకుంటున్నట్టు రాయించుకొని
తిరుపతమ్మ వేలిముద్ర కూడా తీసుకున్నారీ ప్రబుద్ధులు.
చివరి నిమిషంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో
ఆమెకు చేతులు కాలడం తప్పింది...
***
‘శీలం అంటే గుణం... లేదా వ్యక్తిత్వం’
దీన్ని శరీరానికి ఆపాదించే పురుష సమాజం...
అదే శీలం తనకు అక్కర్లేదనుకోవడం అనాగరికం.
"శీలం అంటే.. పురుషులైనా, స్త్రీలైనా తమ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా జీవించటం"
అంతే తప్ప ఒక్క స్త్రీ శరీరానికే సంబంధించింది కాదు.
చదువుకుని..నాగరికులమని జబ్బలు చరుచుకుంటున్న ఆధునిక సమాజంలో
మూఢాచారాల ముసుగులో జరుగుతోన్న అనాగరికత.
ఇటువంటి అనాగరిక మృగాళ్లను కఠినంగా శిక్షించాలి.
...అందుకే అన్నాడు చలం.
‘స్త్రీకి పురుషునితో సమానమైన హక్కులుండాలని
ఆమె ఒక వ్యక్తి అని,
ఆమెకొక వ్యక్తిత్వం ఉంటుందని,
ఆమెకూ సొంత ఇష్టానిష్టాలు, అభిరుచులు,
స్వేచ్ఛానురక్తి ఉంటాయని
తాను పిల్లలను కనే,
వంట చేసి మరబోమ్మ కాదని
పురుషునికున్న స్వేచ్ఛ స్త్రీకీ ఉండాలని’
ఘోషించాడు.
మూఢాచారాల పరదాలను తొలగించుదాం...
మనిషిని మనిషిగా గౌరవించుదాం..

No comments:
Post a Comment