Social Icons

Monday, September 26, 2016

మా పంతులు గారు

 Posted: September 13, 2016

//మా పంతులు గారు//
మా ఊరు...
జ్ఞాపకాల పొదరిల్లు... మమతల హరివిల్లు... అనురాగాల విరిజల్లు
అందుకే అంటారేమో... కన్నతల్లి... స్వంతఊరు ఒక్కటేనని.
అమ్మలోని అనురాగం... స్వంతఊరితోటి అనుబంధం
ఎప్పటికి మనలను ఒదిలిపెట్టవు.
వైఫైలా ఎప్పుడూ మన చుట్టూనే అల్లుకొని వుంటాయి.

అదెంత చిన్న విషయమైనా కావొచ్చు... మనను తీవ్రంగా స్పందింపజేస్తుంది.
వారం రోజులవుతోంది... మా సొంతూరు వట్లూరు వెళ్లి...
అమ్మ వాళ్ల అపార్ట్ మెంట్ లో వినాయకుడి విగ్రహం పెట్టారని,
తప్పకుండా రమ్మని అమ్మ పిలవడంతో పండగరోజున వెళ్లాను.
సొంతూరు గాలి మోసుకొచ్చిన ఎన్నో ఊసులను... జ్ఞాపకాలను గుదిగుచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే...
మరోవైపు వినాయకుడి పూజ హడావుడి.... తెలిసినవాళ్ల పలకరింపులు
కొంగొత్త ఉత్సాహాన్ని నింపుతుంటే...
ఇంత హడావుడిలోనూ నన్నాకర్షించిన విషయం... కుర్ర పంతులు (యంగ్ పురోహితుడు).
అన్నీతానై.. చకచకా అన్నిపనులూ ఒంటిచేత్తో చేసేస్తున్నాడు.
ఒకరకంగా అష్టావధానం చేస్తున్నాడు.
ఆ తర్వాత... తెలిసిన విషయమేంటంటే.... ఆ కుర్రపంతులు పేరు పవన్ శర్మ.
మా పంతులు గారు కప్పగంతుల సూర్యనారాయణ శర్మ గారి అబ్బాయి అని.
ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి మనసు పరుగులు తీసింది.
***
మా పంతులు గారు...
ముహూర్తాల దగ్గర నుంచి పెళ్లిళ్లు, పేరంటాళ్ల వరకూ... వాస్తుల దగ్గర నుంచి చావులు, తద్దినాల
వరకూ అన్నింటి నిర్వహణను ఒంటిచేత్తో చేసేవారు.
చిన్నతనంలోనే తండ్రి కాలంచేయడంతో కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకున్నారు.
తమ్ముళ్లు, చెల్లెళ్లను పెద్దచేసి పెళ్లిళ్లు పేరంటాళ్లు చేసి, ఓ పెద్ద దిక్కుగా నిలిచారు.
ఎంతటి పేదరికంలోనూ... చెదరని చిరునవ్వు.... తొలగని ఆత్మాభిమానం ఆయన సొంతం.
తనకు తెలిసిన పౌరహిత్యాన్ని ఆధారం చేసుకొని...
వారసత్వంగా వచ్చిన గౌరవ మర్యాదలనే ఆలంబనగా చేసుకొని
తన కుటుంబం చుట్టూ సంతోషాల పొదరిల్లు అల్లుకున్న అరుదైన వ్యక్తి మా పంతులు గారు.
మా ఊరిలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలకీ వారే ముహూర్తాలు పెట్టేది.
ఈ పని చేసినందుకు ఇంతివ్వాలి అని ఎవరినీ... ఎప్పుడూ అడిగిందిలేదు.
ఇచ్చినదాంతోనే సంతృప్తి.. అందులోనే ఆనందం...
గ్రామస్తులందరికీ తలలో నాలుకలా... ఒక కుటుంబ సభ్యుడిలా కలిసిపోయారు..
వారి గురించి ఊరిలో అంతా గొప్పగా చెప్పుకునేవారు.
పంతులుగారి తమ్ముడి దగ్గర మేము ట్యూషన్ కి వెళ్లేవారం.
ఆయన్ని మాత్రం కప్పగంతుల అంటూ ఆటపట్టించేవాళ్లం.
అలా పంతులు గారి గురించి చాలా విషయాలు తెలిసేవి. వారి తమ్ముళ్లు కూడా ఎవరూ పంతులు
గారికి సాయపడిందిలేదు.
అలాంటి పంతులుగారు వారి తండ్రి మాదిరిగానే చిన్న వయసులోనే కాలంచేశారు.
పంతులుగారు తన కుర్రతనంలోనే కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నట్టుగానే...
పంతులుగారు మృతితో పవన్ శర్మకూ కుటుంబ బాధ్యతలు తప్పలేదు.
***
ఇప్పుడు వినాయక చవితి రోజు అష్టావధానం చేస్తోన్న యంగ్ పురోహితుడే..
మా పంతులుగారి అబ్బాయి పవన్ శర్మ.
తండ్రి కప్పగంతుల సూర్యనారాయణ శర్మ గారు పవన్ శర్మ చిన్నతనంలోనే కాలం చేయడంతో
కుటుంబ బాధ్యతలను స్వీకరించిన పవన్ శర్మ...
పౌరహిత్యం ద్వారా వచ్చిన సొమ్మునే పొదుపు చేసుకొని... నాల్గు డబ్బులు వెనకేసుకోగలిగాడు.
చెల్లెలి పెళ్లి ఘనంగా చేశాడు. మేనకోడలి బారసాల కూడా అంతే ఘనంగా చేశాడు.
ఉన్నంతలో చక్కని ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు.
ఆధునిక యువకుడైనా... ఆడంబరాలకు పోకుండా... తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.
అందుకే ఇతన్ని చూస్తోంటే... చిన్నప్పటి మా పంతులు గారు గుర్తొచ్చారు.

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates