Social Icons

Monday, September 26, 2016

సంగీత సామ్రాజ్ఞికి శతజయంతి నివాళులు

Posted: September 17, 2016

//సంగీత సామ్రాజ్ఞికి శతజయంతి నివాళులు//
‘కౌసల్యా సుప్రజా రామా పూర్వసంధ్యా ప్రవర్తతే’ అంటూ..
దేవుళ్లకే మేలుకొలుపు పాడే సంగీత రాజ్ఞి...
ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లి...
సుప్రభాత గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మి...

భారతరత్న పురస్కారం పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి.
ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళానిధి.
ఆమె గాత్ర మాధ్యుర్యానికి పరవశించిన నెహ్రూ సంగీత సామ్రాజ్ఞిగా కీర్తించగా...
ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ సుస్వర లక్ష్మిగా కొనియాడగా...
నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా సరోజినాయుడుచే సుబ్బలక్ష్మియే అసలైన నైటింగేల్ అని ప్రశంసలందుకున్నారు.
తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ తదితర
అనేక భాషలలో కీర్తనలు పాడిన బహుభాషా గాయని...
శ్రీవారి సుప్రభాతాన్ని యావత్‌ ప్రపంచానికి పరిచయం చేసిన కర్ణాటక సంగీత ఝరి
ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి (మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి).
***
తమిళనాడులోని మదురైలో 1916 సెప్టెంబరు 16న
న్యాయవాది సుబ్రమణ్య అయ్యర్‌, వీణా విద్వాంసురాలు షణ్ముఖ వడివూ అమ్మాళ్‌కు సుబ్బలక్ష్మి జన్మించారు.
బాల్యంలో పాఠశాలకు వెళ్లడం మానేసి... అక్క, అన్నయ్యలతో కలిసి ఇంటివద్దే చదువు, సంగీతసాధన చేశారు.
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ వద్ద,
హిందుస్థానీ సంగీతాన్ని పండిత్‌ నారాయణరావు వ్యాస్‌ వద్ద శిక్షణ తీసుకున్నారు.
పదేళ్ల వయస్సులో తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్‌ గుడిలోని వందస్తంభాల హాలులో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు.
ఏ భాషలో పాడినా.. తన మాతృభాషలో పాడినట్టుగా భాషానుడికారంతో భావయుక్తంగా ఆలపించడం వారి ప్రత్యేకత.
స్వాతంత్య్ర సమర యోధుడు, ఆనంద వికటన్‌ పత్రిక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ సదాశివన్‌ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు.
భారత సాంస్కతిక రాయబారిగా లండన్‌, న్యూయార్క్‌, కెనెడా, తూర్పుతీర దేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1998లో దేశ అత్యున్నత భారతరత్న పురస్కారం ప్రదానం చేసి ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది.
విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన
కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.
ఆమె గాత్రం మాత్రం సృష్టి ఉన్నంత కాలం ప్రపంచమతా మారుమోగుతూనే ఉంటుంది.
***
సుబ్బలక్ష్మి గారు పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు.
నిండైన విగ్రహం, భారతీయతకు నిలువెత్తు ప్రతీక...
పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక,
కొప్పు... కొప్పు నిండా మల్లెపూలతో చూసేవారికి పూజ్యభావం కలిగితే...
ఆమె తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభిస్తే...
శ్రోతలు ఆమె గానలహరిలో మునిగి ఆనంద పారవశ్యం పొందేవారు.
అంతటి అరుదైన అద్భుత గాయక శిరోమణి.. సంగీత సామ్రాజ్ఞి...
ఎంఎస్.సుబ్బలక్ష్మి గారి శతజయంతి సందర్భంగా ఆ మహా గాయనికి ఘన నివాళులు.

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates