Posted: August 16, 2016
//పంచభూతాలే ఆ తల్లికి మంత్రసానులు//
70ఏళ్ల మన స్వాతంత్ర్యం సిగ్గుతో తల వంచుకోవాలి
అక్కడ ప్రధాని, ఇక్కడ ముఖ్యమంత్రి
అభివృద్ధి గురించి గప్పాలుకొట్టి 24గంటలైనా గడవలేదు
నిర్వీర్యమౌతోన్న స్వాతంత్ర్య ఫలాలను
మరోసారి బట్టబయలు చేసిన హృదయవిదాకర ఘటన ఇది.

హృదయం ద్రవించిపోయే దృశ్యం అది.
బిడ్డకు జన్మనివ్వడం ఎంతటి వేదనా భరితమో
ప్రతి తల్లికీ అనుభవమే...
అంతటి వేదననూ సంతోషంగా భరిస్తుంది తల్లి.
అలాంట తల్లులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని
ప్రభుత్వము, అధికారులు సిగ్గుతో తలవాల్చుకునే సంఘటనిది
బస్సు అందుబాటులో లేక
108 వాహనం సకాలంలో రాక
తెరలు తెరలుగా వస్తోన్న పురిటి నొప్పులు తాళలేక
బిడ్డపై మమకారం ఆ తల్లిని 10కిలోమీటర్లు నడిపించింది
ఉదయమెప్పుడో బయల్దేరి ఒంటిగంటైనా ఆస్ప్రత్రికి చేరలేక
అధికమవుతున్న నొప్పులు భరించలేక
నడిరోడ్డుపైనే కుప్పకూలింది...
అందరూ చూస్తుండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది
నడిరోడ్డే ఆ బిడ్డకు పట్టుపరుపయ్యింది
పంచభూతాలే ఆ తల్లికి మంత్రసానులయ్యారు
చూపురుల గుండెలను ద్రవింపచేసిన దృశ్యమిది..
అప్పుడొచ్చింది తాపీగా 108 వాహనం.

***
నడిరోడ్డుపై గిరిజన మహిళ ప్రసవం
-----------------
బస్సు అందుబాటులో లేకపోవడం, 108 వాహనం సకాలంలో రాకపోవడంతో ఓ గిరిజన మహిళ నడిరోడ్డుపై ప్రసవించింది.
విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మెంటాడ మండలం ఆండ్ర శివారు పైడిపర్తి గిరిజన
గ్రామానికి చెందిన వెలిగడ జమలమ్మకు మంగళవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. గజపతినగరం కమ్యూనిటీ ఆస్పత్రిలో
చేరేందుకు భర్త ముత్యాలుతో కలిసి బస్సు కోసం పది కిలోమీటర్ల దూరంలోని ఆండ్రకు కాలినడకన చేరుకుంది. ఆండ్ర నుంచి
గజపతినగరం వెళ్లే బస్సు ఉదయం పది గంటలకు రావాల్సి ఉంది. 11 గంటల వరకూ రాకపోవడంతో జమలమ్మ భర్త 108కు
ఫోన్ చేశాడు. సమయానికి ఆ వాహనమూ రాలేదు. గంట తరువాత బస్సు రావడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు వారు
గజపతినగరం చేరుకున్నారు. బస్సు దిగి ఆస్పత్రికి వెళ్తుండగా మెంటాడ రోడ్డులోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు వద్ద నొప్పులు
అధికం కావడంతో నడవలేక జమలమ్మ కుప్పకూలిపోయింది. పలువురు చూస్తుండగానే నడిరోడ్డుపై పండంటి బిడ్డకు
జన్మనిచ్చింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన 108 వాహన సిబ్బంది సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ మన స్వతంత్ర భారతం
నాయకులారా ఇలాంటి సంఘటనలు చూసైనా కళ్లు తెరవండి
గ్రామాల్లో.. గిరిజన తండాల్లో.. మారుమూల ప్రాంతాల్లో
కనీస వైద్య సౌకర్యాలు కల్పించండి.
70ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రాథమిక వైద్యం అందక
ప్రసవ సమయంలో తల్లీ, బిడ్డ చనిపోతున్న ఘటనలు
గ్రామీణ ప్రాంతాల్లో అనేకం...
ఆ పిచ్చితల్లుల కడుపుకోతను నివారించండి...
ఓ తల్లిగా...ఇది నా ఆవేదన...అభ్యర్థన.

No comments:
Post a Comment