Posted: August 12, 2016
ఆ స్తంభాలపై నరసింహ మూర్తుల ధ్యాన శ్లోక వర్ణనలు
శతాబ్దాల నాటి రమణీయ కళావైదుష్యం
ఒరియా, తెలుగు భాషలలో శిలా ఫలకాలు...
అవి ఉత్త రాళ్ళు కాదు...
చరిత్ర చెక్కిన శిల్పాలు... గత చరిత్రకు ఆనవాళ్లు...
మనతో మాట్లాడుతున్నట్టు...
తరతరాల కథలన్నీ చెబుతున్నట్టు...
గత వైభవానికి మిగిలిన జ్ఞాపకాలు
మన కనుల ముందు కదలాడే సాక్ష్యాలు...
ఇంతటి అద్భుత కళా నిలయం... సింహాద్రి అప్పన్న దేవాలయం.
విశాఖలో మూడో రోజు...
------------------
------------------
మూడు ప్రాకారాలు...
అయిదు ద్వారాలు...
నాట్య, ఆస్థాన, భోగ మంటపాలు...
ప్రత్యేకతలుగా విలసిల్లుతోన్న ఆలయం.
ఆలయ స్తంభాలు శిల్పకళా శోభితాలు
అయిదు ద్వారాలు...
నాట్య, ఆస్థాన, భోగ మంటపాలు...
ప్రత్యేకతలుగా విలసిల్లుతోన్న ఆలయం.
ఆలయ స్తంభాలు శిల్పకళా శోభితాలు
ఆ స్తంభాలపై నరసింహ మూర్తుల ధ్యాన శ్లోక వర్ణనలు
శతాబ్దాల నాటి రమణీయ కళావైదుష్యం
ఒరియా, తెలుగు భాషలలో శిలా ఫలకాలు...
అవి ఉత్త రాళ్ళు కాదు...
చరిత్ర చెక్కిన శిల్పాలు... గత చరిత్రకు ఆనవాళ్లు...
మనతో మాట్లాడుతున్నట్టు...
తరతరాల కథలన్నీ చెబుతున్నట్టు...
గత వైభవానికి మిగిలిన జ్ఞాపకాలు
మన కనుల ముందు కదలాడే సాక్ష్యాలు...
ఇంతటి అద్భుత కళా నిలయం... సింహాద్రి అప్పన్న దేవాలయం.
***
విశాఖపట్నానికి ఉత్తరాన 10 మైళ్ళ దూరంలో...
సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో..
అధికభాగం అడవులు, కొండలతో..
నీటిధారలతో... సన్నని కాలువలతో..
ప్రకృతి అంతా ఒక్కచోటే పోగుపడినట్టుగా
ఆహ్లాదకరమైన వాతావరణంలో.. అవ్యక్తానుభూతిని కలిగించింది
సింహాచలం కొండపై నెలవైన సింహాద్రి అప్పన్న(శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి) దేవాలయం.
గాలి గోపురము(సింహ ద్వారం), కప్ప స్తంభం,
జల ధారలు, భైరవ వాక, వరాహ పుష్కరిణి, మాధవధార ఇక్కడి ప్రత్యేకతలు.
ఈ దేవాలయంలోని కళానైపుణ్యం కోణార్క్ దేవాలయ శిల్పకళను పోలి ఉంటుంది.
ఏనుగులు, పూవులు, మొక్కలు విరివిగా మలచబడ్డాయి.
ఏడాదిలో 364 రోజులూ సుగంధ పరిమళ చందనమై పూతలో దర్శనమిచ్చే స్వామి వారు
వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రం నిజరూప దర్శనమిస్తారు.
శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ 1516లో సింహాచలాన్ని దర్శించారని అక్కడి శిలాశాసనం ద్వారా తెలుస్తోంది.
ఈ దేవాలయంలో దాదాపు 525 శిలా శాసనాలున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు మరి.
ఈ ఆలయానికి వంశ పారంపర్య ధర్మకర్తలుగా విజయనగర రాజ కుటుంబీకులే కొనసాగుతుండడం మరో విశేషం.

ప్రకృతి రమణీయత... ఆధ్యాత్మికత కలగలిసిన
ఒక చారిత్రక అద్భుతం.. సింహాచల ఆలయం
ఈ ఆలయాన్ని దర్శించడం నిజంగా నా అదృష్టం
ప్రకృతి రమణీయత... ఆధ్యాత్మికత కలగలిసిన
ఒక చారిత్రక అద్భుతం.. సింహాచల ఆలయం
ఈ ఆలయాన్ని దర్శించడం నిజంగా నా అదృష్టం

No comments:
Post a Comment