Posted : August 29, 2016
ఆదివారం ‘ఈనాడు’ సండే మ్యాగజైన్ లో వచ్చిన ‘‘తస్మాత్ జాగ్రత్త’’ కథ చాలా బాగుంది.
నాగేశ్వరరావు గారు రచించిన ఈ కథ.. హాస్యంతో పాటు ఒకింత సందేశాన్ని కూడా ఇస్తుంది.
సంప్రదాయం పేరుతో జరుగుతోన్న ఆచార వ్యవహారాలపై వ్యంగ్యోక్తులు విసురుతూ చక్కని హాస్యాన్నందించారు.
ఈ ఆధునిక యుగంలో చావులు, తద్దినాలు కూడా ఈవెంట్స్ గా మారిన నేపథ్యంలో...
నాన్న తద్దినానికి సోమయాజీ పడిన తిప్పలు... బామ్మ చారుమతి చేసిన హడావుడీ కడుబ్బ నవ్విస్తుంది.
అంతేకాదు... తరిగిపోతున్న విలువలు, పెరిగిపోతున్న కాలుష్యం, కరిగిపోతున్న పర్యావరణం పట్ల అంతర్లీనంగా రచయిత ఒకింత బాధను వ్యక్తం చేయడం కనిపిస్తుంది.
అది నిజం కూడా... పట్టణీకరణ పెరగడంతో వృక్షాల స్థానంలో భవనాలు వెలుస్తున్నాయి.
కాకి కాలు మోపడానికి కాసింత జాగా కూడా దొరక్క పోవడం ఒకటైతే...
అన్నం తిన్న ప్లేటు కడిగి బయటపోస్తే.. కడిగిన నీళ్లతో పాటు బయటపడిన నాలుగు మెతుకులు పక్షులకు ఆహారమయ్యేది...
అపార్ట్మెంట్ల కల్చర్ వచ్చిన తర్వాత కంచంలోని మెతుకులు కూడా డ్రైజేజీలోకే పోతున్నాయి.
ఈ కాంక్రీట్ నగరాల్లో నిలువ నీడలేక, తాగడానికి చుక్క నీరు దొరక్క, తినడానికి నాలుగు మెతుకులూ కనబడక... పక్షులు కనుమరుగవుతున్నాయి.
తద్దినం నాడు పెట్టిన పిండం తినడాక్కూడా కాకి దొరక్కపోతే..
పంజరంలో బందించిన కమర్షియల్ కాకిని 500రూపాయల అద్దెకి తెచ్చుకోవాల్సిన దుస్థితిని
రచయిత చక్కని వ్యంగ్యంతో ఒక హెచ్చరిక చేస్తాడు.
ఛాందసురాలుగా కనిపించే బామ్మ చారుమతి కూడా ‘‘నీ బొంద, చూడు కాశీపతీ... ఇలా కాకిని పంజరంలో పెట్టుకుని తద్దినాలు పెట్టించడం కాదు. నువ్వు తద్దినం పెట్టిన ప్రతిచోటా ఓ నాలుగు మొక్కలు నాటించు. రేపు నువ్వు పోయాక నీ పిండం తినడానికైనా కాకులు వస్తాయేమో’’ అంటూ ఒక పంచ్ వేస్తుంది.
బామ్మ వేసిన పంచ్ తద్దినం పెట్టిన పంతులుపైనే అయినా...
ఇది సమాజానికి రచయిత చేసిన ఓ హెచ్చరికలా భావించాలి.
అందరూ ఖచ్చితంగా చదవదగిన కథ.
మంచి కథను అందించిన రచయితకు ధన్యవాదాలు...

No comments:
Post a Comment