Posted: August 20, 2016
అభినందనలు రజత సింధూరమా...
వినువీధులలో భారతకీర్తిని రెపరెపలాడించిన
మువ్వన్నెల పతాకమా..
బాడ్మింటన్ చరిత్రలో రికార్డు సృష్టించావు
ఒలింపిక్ రజతం సాధించిన భారత క్రీడాకారిణిగా...
పసిడి ఆశలు చేజారినా
నువు కనబరిచిన పోరాట స్ఫూర్తి అభినందనీయం...
అనుభవం ముందు తలవంచినా
సడలని ఆత్మవిశ్వాసం నీ సొంతం...
మలచుకో మరో విజయానికి మెట్టుగా
ఈ అనుభవం...
సాగిపో తుదివరకూ
విశ్రమించని బాటసారిగా...
నీ వెన్నంటే వుంటాయి
కోట్లాది భారతీయుల ఆశలు... ఆశీస్సులు...
అభినందనలు రజత సింధూరమా...
వినువీధులలో భారతకీర్తిని రెపరెపలాడించిన
మువ్వన్నెల పతాకమా..
బాడ్మింటన్ చరిత్రలో రికార్డు సృష్టించావు
ఒలింపిక్ రజతం సాధించిన భారత క్రీడాకారిణిగా...
పసిడి ఆశలు చేజారినా
నువు కనబరిచిన పోరాట స్ఫూర్తి అభినందనీయం...
అనుభవం ముందు తలవంచినా
సడలని ఆత్మవిశ్వాసం నీ సొంతం...
మలచుకో మరో విజయానికి మెట్టుగా
ఈ అనుభవం...
సాగిపో తుదివరకూ
విశ్రమించని బాటసారిగా...
నీ వెన్నంటే వుంటాయి
కోట్లాది భారతీయుల ఆశలు... ఆశీస్సులు...







No comments:
Post a Comment