Social Icons

Monday, September 26, 2016

ఈయన దేవుడు కాదు... మనిషి..

Posted: August 27, 2016

ఆలిని...
అడవులకంపిన రాముడి గురించి విన్నాం
నడివీధిలో అమ్మేసిన హరిశ్చంద్రుడి గురించీ విన్నాం
.... అయినా వాళ్లు దేవుళ్ళు.
నాతిచరామి అని ప్రమాణం చేసి...
ఏడడుగులకు కొత్త అర్థం చెప్పి...

భర్త అనే పదానికే సరికొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తిని
ఇప్పుడు చూస్తున్నాం.....
ఈయన దేవుడు కాదు... మనిషి..
మానవత్వం మూర్తీభవించిన మహామనీషి.....
అందుకే...
నమ్మకంతో తన వెంట నడిచిన భార్య శవమైనా
మార్చురీవాహనం రోడ్డుపక్కనే వదిలేసినా
తను మాత్రం నడివీధిలో వదిలేయలేదు...
ఏ మెడికల్ కాలేజీకో అమ్మేయలేదు...
భార్య శవాన్ని భుజనవేసుకొని
పట్టువదలని విక్రమార్కుడిలా నడిచాడు తమ ఊరివైపు...
ఒకటి కాదు... రెండు కాదు... 26కి.మీ.
మళ్లీ ఏడడుగులేసినంత సులభంగా..
***
‘‘ఈ పురాతన సత్రానికి రెండే వాకిళ్లు...‘రాత్రి, పగలూ’
ఆ ద్వారంలోంచి సుల్తాను తర్వాత సుల్తాను ప్రవేశించి
పరిపాలించాడు, అనుభవించాడు
ఏ గూర్తూ లేకుండా వచ్చిన దారినే పోయాడు..’’
అంటాడు.. ఉమర్ ఖయ్యామ్ ఇలాంటి పాలకునుద్దేశించే....
ప్రజల గోడు పట్టని ఏ పాలకుడైనా
ఏ గుర్తులూ మిగల్చకుండానే పోతాడు...
కళ్లకు అధికారం పొరలుగమ్మిన ఇతగాడు అంతే...

No comments:

Post a Comment

Comments system

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Blogger Templates