Posted: August 22, 2016
‘నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను..’
... ఈ అక్షరాలకు రూపమిచ్చిన ఆచార్యుడాయన
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను..’
... ఈ అక్షరాలకు రూపమిచ్చిన ఆచార్యుడాయన
కఠోర సాధనను నమ్మిన నిత్యశ్రామికుడాయన
గొప్ప ఆటగాడిగా... అంతకంటే గొప్ప కోచ్ గా అనితరసాధ్యుడాయన
విద్యార్థులను తీర్చిదిద్దడంలో అపర ద్రోణుడాయన
ఆయన మరెవరో కాదు... పుల్లెల గోపీచంద్.
ఆటగాడిగా రిటైరై.. కోచ్ గా అద్భుతాలు చేస్తోన్న కార్యసాధకుడు.
ఒలింపిక్స్ లో సైనాతో కాంస్యం... సింధూతో రజతం సాధించిన మార్గదర్శకుడు
అపజయాలెదురైనప్పుడు కుంగిపోనీ దీశాలి
విజయాలు సాధించినప్పుడు పొంగిపోని వినయశీలి
కెరీర్ తొలి రోజుల్లో అలుపెరుగని పోరాటం,
మధ్యలో ప్రేమవివాహం....
బ్యాడ్మింటన్ రంగ చరిత్రను తిరగరాసిన ఎన్నో విజయాలు
అన్నీ కలగలిసిన గోపీచంద్ జీవిత కథ సినిమా కథలకేమాత్రం తీసిపోనిది.
1999లో అర్జున పురస్కారం
2000-01 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం
2005 లో పద్మశ్రీ పురస్కారం
2009 లో ద్రోణాచార్య పురస్కారం
2014 లో పద్మభూషణ్ పురస్కారం
ఇవన్నీ అతని కార్యసాధనకు గౌరవ చిహ్నాలు
ఎంత ఎదిగినా ఒదిగివుండే గోపీచంద్ అకాడెమీ నుంచి
మరెంతోమంది సైనాలు, సింధూలు, కశ్యప్ లు
భారతీయ బ్యాడ్మింటన్ బరిలోకి దూసుకురావాలని
మరెన్నె పతకాలను సాధించి...
భరతమాత కంఠహారాలుగా మెరవాలని...
దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని కోరుకుంటూ
అపర ద్రోణుడు గోపీచంద్ కు హృదయపూర్వక అభినందనలు








No comments:
Post a Comment