పేరుకు తగ్గట్టుగానే మనసును గిలిగింతలు పెట్టే చక్కని ప్రేమకథా చిత్రం ‘పెళ్లి చూపులు’. నిజజీవితంలో పెళ్ళిచూపులు
కలిగించేలాంటి ఓ అనుభూతిని ఈ సినిమా కూడా అందిస్తుంది. ఈ సినిమా ఇతివృత్తం చాలా చిన్నది. ప్రేమ, కెరీర్, పెళ్లి
... ఈ మూడు అంశాలను తీసుకొని నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా చాలా సున్నితంగా... ఒక సుందర శిల్పాన్ని
చెక్కినంత ఏకాగ్రతగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు. చక్కని కథ, కథనం, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, హీరో,

హీరోయిన్ల నటన,మంచి హాస్యం, చక్కని సంభాషణలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి.
కథలోకి వస్తే... హీరో (ప్రశాంత్) చెఫ్ గా స్థిరపడాలనుకుంటాడు. తండ్రి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటాడు.
ఇది హీరోకి ఇష్టం వుండదు. జీవితంలో ఒక లక్ష్యం లేనట్టుగా ఇతనికి పెళ్లిచేస్తే అయినా దారికొస్తాడేమోనని చిత్ర అనే
అమ్మాయితో పెళ్ళి నిశ్చయం చేస్తాడు. ఆమెకు పెళ్లి ఇష్టం ఉండదు. అనుకోని విధంగా ప్రశాంత్, చిత్ర ఒక రూమ్ లో లాక్
అవుతారు. మెకానిక్ వచ్చి డోర్ లాక్ తెరచే లోపు... వీళ్ల మధ్య మాటలు కలుస్తాయి. ఒకరి ఇష్టాలు మరొకరు
తెలుసుకుంటారు. ఈలోపు తాము వచ్చింది రాంగ్ అడ్రెస్ అనీ, వేరే ఇంటికి వెళ్ళబోయి ఇటువచ్చామని ప్రశాంత్ తండ్రి
అతన్ని తీసుకెళతాడు. అసలు పెండ్లి చూపుల ఇంటికి వెళతారు. తన వ్యాపారాలతోపాటు తన కూతుర్ని ఇవ్వడానికి ఆమె
తండ్రి సిద్ధపడతాడు. అయితే... వ్యాపారాలు చూసుకోవాలంటే ఎంతోకొంత అనుభవంకావాలి కనుక.. ఏదైనా బిజినెస్‌లో
అనుభవం సంపాదించమంటాడు. దీంతో మొదట పెళ్లిచూపులు చూసిన చిత్రను ఒప్పించి ఫుడ్‌ట్రక్ బిజినెస్ ప్రారంభిస్తారు.
రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరు వ్యక్తుల ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది? చివరకు వీరి కథ ఏమయింది?
అనేది సినిమాలో చూడాల్సిందే. మొత్తానికి ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏమిటంటే... పెళ్లిచూపుల కోసం ఒకరింటికి
వెళ్లబోయి మరొకరి ఇంటికి వెళ్ళడం. అదేవిధంగా... అమ్మాయి, అబ్బాయి ఒకే గదిలో లాక్ అవడంతో ఒకరి లవ్ స్టోరీని
మరొకరు చెప్పుకోవడం కూడా కొత్తగా అనిపిస్తుంది.

హీరోగా నటించిన విజయ్ దేవరకొండకు ఇది రెండో సినిమా. మొదటిది ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. రెండో సినిమాతోనే
తనదైన స్టైల్ లో నటించి మెప్పించాడు. హీరోయిన్ పాత్రధారి రీతూవర్మ కూడా చక్కని నటనను ప్రదర్శించి, మంచి సపోర్ట్
ఇస్తుంది. మిగతా అందరూ కొత్తవాళ్లే అయినా తమతమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీరిలో చెప్పుకోదగ్గ వారిలో హీరో
తండ్రిగా నటించిన నటుడు. చాలా సహజంగా నటించి ఆకట్టుకోగా, చెప్పుకోదగ్గ పాత్ర హీరో ఫ్రెండ్ ది. పంచ్ డైలాగ్
లతో మంచి హాస్యాన్ని పండించాడు. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి చెప్పాలంటే... తనకిది మొదటి చిత్రమే
అయినా నేటి యువతరం ఆలోచనలను, వారి భావోద్వేగాలను ఒడిసిపట్టుకొని ఓ సరికొత్త కథను ప్రేక్షకుల ముందుంచాలన్న
అతని క్రియేటివిటీని కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే.

ఇలాంటి చిన్న సినిమాలను, టాలెంట్ ఉన్న కథకులు, దర్శకులు, నటులను ప్రోత్సహించాలి. అప్పుడే కొత్తకొత్త కథలు
పుడతాయి. సరికొత్త టాలెంట్ వెలుగులోకి వస్తుంది. ఆల్ ద బెస్ట్... ‘పెళ్లి చూపులు’ టీమ్.

- అంజనీ యలమంచిలి
No comments:
Post a Comment