Social Icons

Tuesday, September 27, 2016

అభినవ వాసుదేవుడు

//అభినవ వాసుదేవుడు//

పొత్తిగుడ్డల్లో చుట్టిన బాలకృష్ణుడితో నదిని దాటిన వాసుదేవుడి కథ విన్నాం
మాతాపితృ సేవాపరాయణుడైన శ్రవణ కుమారుని కథా విన్నాం
పతి ప్రాణాల కోసం యముడితో తలపడిన సావిత్రి కథా విన్నాం
బిడ్డను బతికించుకోడానికి బాహుబలిలో శివగామి పడిన తపనా చూశాం
కన్నబిడ్డ కోసం కిడ్నీ దానం చేసిన తండ్రినీ కన్నాం...
కానీ....

తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఐదునెలల చిన్నారిని కాపాడుకోడానికి
ఓ తండ్రి చేసిన జలయాగం ఇది....
ఇది కట్టుకథ కాదు...
సినిమా ట్రిక్ అంతకంటే కాదు..
ఇది యథార్థ జీవన చిత్రం
విశాఖ మన్యంలో గిరిజనులు ఎదుర్కొనే వ్యధార్థజీవన యానం
బిడ్డను బతికించుకోడానికి ఓ తండ్రి చేసిన మృత్యుపోరాటం

***
ఇది సినిమా దృశ్యాన్ని తలపిస్తున్నా...
హృదయం ద్రవించే దృశ్యం..
మనసును చలింపజేసే వాస్తవం.
ఒకవైపు నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఐదునెలల పసిగుడ్డు.
నాటువైద్యం చేయించినా ఫలితం శూన్యం.
మరోవైపు  వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోన్న  కుడుముసారి వాగు.
తన బిడ్డను బతికించుకోవాలంటే ఆ వాగు దాటి, లోతుగెడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోడం కోసం ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగును కూడా లెక్కచేయలేదా తండ్రి.
బిడ్డ తడిచిపోకూడదని ప్లాస్టిక్‌ కవర్లలో చుట్టి, తలపై పెట్టుకొని,
పీకల్లోతు నీటిని దాటుతోన్న ఆతను అభినవ వాసుదేవుడు.
తండ్రి అన్న పదానికే కొత్త అర్థాన్నిచ్చిన అతడే...పాంగి సత్తిబాబు.
విశాఖ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని కుడుముసారి గ్రామం వద్ద మంగళవారం (27-09-2016)నాటి
యదార్థ  దృశ్యం ఇది.
అతని మనోనిబ్బరాన్ని.. పట్టుదలను అభినందించితీరాలి.
హ్యాట్సాఫ్...సత్తిబాబు..

No comments:

Post a Comment

Comments system

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Blogger Templates