ఈ ఆదివారానికి ఎన్నో ప్రత్యేకతలు
జూలై మాసం చివరి రోజు... సాయంత్రం 6 గంటలు
అల్లన తరలొచ్చిన మలయమారుత వీచికలు
మెలమెల్లగా కదిలొచ్చిన శ్రావణమేఘపు చిరుజల్లులు
బాలంత్రపు వారి యింట విరబూసిన సాహితీసుమాలు
ఆనక ఆహుతులను అలరించిన ‘ప్రసన్న’ రాగాలు
ఆపై ప్రసూనా హేమచంద్రలు పంచిన ఆత్మీయ ఆతిథ్యాలు
***
ఆదివారం (31-97-016) సాయంత్రం 6గంటలకు జరిగిన
‘ప్రసన్నకుమార్ సర్రాజు కథలు’ 2వ పుస్తక పరిచయ సమావేశానికి
బాలంత్రపు ప్రసూన హేమచంద్ర గారి గృహం వేదికయ్యింది.
ఆహ్లాదకర వాతావరణంలో సాహితీ మిత్రుల సమక్షంలో
ప్రసూనా బాలంత్రపు వ్యాఖ్యాతగా వ్యవహరించిన
ఈ పుస్తక పరిచయ కార్యక్రమం ఆసాంతం అలరించింది.
హాస్యం... వ్యంగ్యం... వెటకారం... చమత్కారం...
ఈ నాలుగింటి కలయికే ప్రసన్నకుమార్ సర్రాజు కథలు.
ఆలోచనలు రేకెత్తించేలా రాయగల హాస్య రచయితల్లో సర్రాజు ఒకరు.
వారు రచించిన ఈ కథల సంపుటిని ఈ సభావేదికగా పరిచయం చేశారు.
ఈ కథలను నారాయణరావుగారు సమీక్షిస్తే...
భట్టు గారు తనదైన చమత్కార పూరిత శైలితో హాస్యపు జల్లు కురిపించారు.
డాక్టర్ భార్గవీ రొంపిచర్ల, శిరీష దాసరి, మనోజ నంబూరి, డాక్టర్ హేమ పరిమి వంటి
సాహితీవేత్తలు, సాహిత్యాభిలాషులతో ఈ సాయంత్రం శోభాయమానం అయింది.
***
అనంతరం ప్రసన్న కుమార్ గారు ఆలపించిన పాటల ప్రవాహం
సాహితీమిత్రులను సమ్మోహితులను చేసింది.
మహ్మద్ రఫీ, ముఖేష్, సైగల్ తదితరుల పాటలను అద్భుతంగా ఆలపించారు.
రఫీ గొంతులోని మాధుర్యాన్ని అలవోకగా పలికించారు.
అంతే గొప్పగా సంగీతాన్ని అందించారు.
నన్ను మరింత ఆనందపరచిన విషయం....
మా అక్క డాక్టర్ భార్గవి గారు కూడా గొంతు కలపడం.
పుస్తక పరిచయ కార్యక్రమంగా మొదలై...
సంగీత కచ్చేరీగా ముగిసింది.
ఆహుతులను ఆనందాశ్చర్యాలతో ముంచివేసింది.
***
చివరగా...
సంగీత సాహిత్యాలతో పాటు పసందైన వంటకాలతో ఆతిథ్యం
బాలంత్రపు రజనీకాంతరావు గారి సంగీత, సాహిత్య వారసత్వం
ప్రసూనా హేమచంద్రల అతిథి సత్కారం
విచ్చేసిన సాహితీప్రియుల మనసులను చూరగొన్నది.
ఈ అందమైన సాయంత్రం ఆవహించిన సంగీత సాహిత్యాల అనుభూతిని
ఓ జ్ఞాపకంగా పదిలపరచుకొని వెనుదిరిగాము....

No comments:
Post a Comment