Social Icons

Monday, September 26, 2016

సంగీత రస ఝరిలో ఓ సాయంత్రం

Posted: September 05, 2016

సంగీత రస ఝరిలో ఓ సాయంత్రం--------------------------------------------
మరో అందమైన సాయంత్రాన్ని అద్భుతంగా ఆస్వాదించిన రోజు (04-09-2016 ఆదివారం).
సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం(విజయవాడ) కర్నాటక సంగీత ఝరిలో ఓలలాడింది.
సంగీతప్రియుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియం పరవశించింది.
బెంగళూరుకు చెందిన ప్రిన్స్ రామవర్మ నిర్వహించిన కర్నాటక గాత్ర సంగీత కచేరీ 

తేనెలూరు రాగాల ఝరిని తలపించింది.
చాలాకాలం తరువాత సంగీతప్రియులు రామవర్మ గాత్రంతో మైమరచిపోయారు. 
ఆయన స్వర విన్యాసానికి ఆ కళాశాల ప్రాంగణం పులకించిందంటే అతిశయోక్తి కాబోదు.
కర్నాటక సంగీతాన్ని దశదిశలా ప్రవహింపజేసిన వాగ్గేయకారుల కీర్తనలను అద్భుతంగా ఆలపించి..
ఆహుతుల హృదయాలలో ఓ సునామీని సృష్టించారు సంగీత కళానిధి రామవర్మ.
గంభీరనాట రాగంలో ‘అమ్మా ఆనంద దాయని..’ వర్ణంతో ప్రారంభించి...
మంగళంపల్లి రచించి స్వరపరచిన కదనకుతూహల రాగం థిల్లానాతో ముగించారు. 
రామవర్మ గారికి 14ఏళ్ల వయసులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు రచించి స్వరపరచిన 
వకుళాభరణ రాగంలో సుకుమారి కీర్తనతో పాటు... రామదాసు తదితర కీర్తనలను రసభరితంగా గానం 
చేశారు.
రామవర్మ గారి గాత్ర విన్యాసానికి ఎస్‌ఆర్‌ వేణు గారి వయోలిన్‌, హరికుమార్‌ గారి మృదంగం 
తోడవడంతో ఓ సంగీత ప్రపంచమే సిద్ధార్థ ఆడిటోరియం ప్రాంగణంలో ఆవిష్కృతమైంది. 
***
ప్రిన్స్ రామవర్మ... 
స్వాతి తిరునాళ్ సాహిత్య సంపద.. సంగీత సాహిత్య వైభవానికి ప్రతీకగా నిలిచిన 
గొప్ప సంగీత విద్వాంసులు. 
ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ కుటుంబానికి చెందినవారు.
సంగీత సాహిత్య వారసత్వ సంపదను తన గానామృతం ద్వారా విస్తరింపబూనటం...
వారి సంగీతానురక్తికి ప్రబల నిదర్శనం.
మహారాజా స్వాతి తిరునాళ్ కృతులు, సంగీత సాహిత్య వైభవం ప్రిన్స్ రాజారామవర్మ వారసత్వం.
రామవర్మ పదునాలుగేళ్ల వయస్సులోనే ఆచార్య వి.హరిహర సుబ్రహ్మణ్య అయ్యర్, 
కళానిధి కె.ఎస్.నారాయణస్వామి, కళానిధి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి 
ఉద్దండుల శిశ్రూషణతో తుది మెరుగులు దిద్దుకున్నారు.
స్వీయ కృషితో హిందుస్థానీ నేర్చుకోవడంతోపాటు... వీణలో కూడా ప్రావీణ్యత సంపాదించారు. 
మూడు పదుల వయసులోనే టి.వి.గోపాలకృష్ణన్ వంటి ప్రముఖుల ప్రోత్సాహంతో కచేరీలు 
సమర్పిస్తూ...
స్వాతి తిరునాళ్ కీర్తనల ప్రచార సారధిగా నిల్చిన ఏకైక రాజవంశ అనుయాయ ప్రతినిధిగా రామవర్మ 
ప్రఖ్యాతిగాంచారు.
పాహి పద్మనాభ (బిళహరి), దేవదేవ (పూర్వీ కళ్యాణి), సరసిజనాభ (అఠాణ పద వర్ణం), 
శ్రీరమణ విభో (ఆరభి), అజ్ ఆయే శ్యాంమోహన్ (మిశ్రపహాడి రాగం) వంటి ఎన్నో కీర్తనలను 
గానం చేయడంలో అందెవేసిన చెయ్యి ఆయనది.
దేశ విదేశాల్లో అనేక సంగీత కచేరీలు నిర్వహించిన సంగీత రసజ్ఞులు రామవర్మ.
వాగ్గేయకారుల వైభవ చరితను నేటి తరానికి అందించడంలో... స్ఫూర్తిని నింపడంలో 
ఒక వారధిగా నిలిచిన సంగీత గాన గంధర్వుడు ప్రిన్స్ రాజా రామవర్మ. 
***
ఇంతటి ఒక అద్భుతమైన సాయంత్రాన్ని అందించిన 
డాక్టర్ ప్రసూన సిస్టర్స్ (నాగప్రసూన, నాగలక్ష్మి, నాగమల్లిక, నాగశైల) 
కళాభిరుచిని, సంగీతాభిలాషను అభినందించాలి.
వీరి తల్లిగారు.. ఇమీస్‌ (ఐఎంఐఎస్‌) వ్యవస్థాపకులు 
డాక్టర్ ఇందుమతి గారి 80వ జన్మదినం సందర్భంగా....
కర్నాటక గాత్ర కచేరీ రూపంలో ఒక అరుదైన బహుమతిని వారి అమ్మగారికి అందించారు.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రపంచస్థాయి సంగీత విద్వాంసులు 
ప్రిన్స్ రామవర్మగారి గానామృతాన్ని ఆస్వాదించడం...
వారి కుటుంబీకులతో పాటు ఆహుతులైన అందరికీ ఒక అనుభూతిని మిగిల్చింది.
అదీ... ఇందుమతి అమ్మగారి జన్మదినం కావడం మరింత ఆనందాన్నిచ్చింది.
ఈ సందర్భంగా ఇందుమతి అమ్మగారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీ కాంతరావు గారు,
వారి అభిమానులతో పాటు పెద్దసంఖ్యలో పాల్గొన్న అందరికీ అభినందనలు....



No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates