Posted : August 11, 2016
విశాఖలో రెండో రోజు :
-------------------------
అరసవల్లి సూర్యదేవాలయాన్ని సందర్శించాలన్న కోర్కె
కాసింత ఇబ్బంది పెట్టిన ఎండ వేడిమిని సైతం జయించింది.
ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న
ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి.
శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో వుంది.

ఏడాదికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో
గర్బ గుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఈ దేవాలయం ప్రత్యేకత.
ప్రతియేటా మార్చి 9, 10, 11, 12 తాదీల్లోనూ...
అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ...
ఆదిత్యుని తొలికిరణాలు స్వామివారిని స్పృశిస్తాయి.
ఈ అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.
మాములు రోజుల్లోకంటే... మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో
ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.
ముఖ్యంగా రథసప్తమినాడు భక్తులు లక్షల్లో వస్తారనేది అందరికీ తెలిసిందే.
***
ఆ తర్వాత...
శ్రీకాకుళం నుండి 15 కి.మీ. దూరంలో వున్న ‘శ్రీకూర్మనాధ స్వామి’ మందిరాన్నీ దర్శించాము.
విష్ణువు కూర్మావతారంలో ఇక్కడ పూజింపబడతాడు.
మనదేశంలో ఇటువంటి కూర్మావతార మందిరం ఇదొక్కటేనట.
ఈ మందిరం శిల్పకళాశైలిని చూడటానికి రెండు కళ్లూ చాలలేదంటే..
ఆ కళావైభవ విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉండటం కూడా మరో ప్రత్యేకత.
శ్రీకూర్మాం గుడి లోపల ఏక శిలతో తయారుచేసిన స్థంభం మరింత ఆకర్షణీయం.

చివరిగా...
ఉత్తరాంధ్ర ప్రజలు దైవం...
పూసపాటి రాజుల ఇలవేల్పు పైడిమాంబ...
విజయనగరం మూడు లాంతర్లు కూడలిలో ఉన్న ఆ అమ్మవారి దేవాలయాన్నీ దర్శించాము.
అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభమై... ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే ఆశ్చర్యమనిపించింది.
పైడిమాంబ వారి కథ చారిత్రక నేపథ్యంతో ముడిపడివుంది.
ఆ చరిత్రను చెప్పే సాహసం చేయట్లేదు కానీ..
తన కథ తెలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపించింది.

నా పోస్ట్ ఇక్కడి మిత్రులకు కొత్తగా అనిపించకపోయినా....
ఈ మూడు చారిత్రక ఆలయాలను దర్శించడం ఆనందంగా వుంది.
ఎంతో ప్రశాంతతను పొందిన అనుభూతికి లోనయ్యా...
ఈ ఆలయాల చరిత్ర జగద్విదితమే...
ఈ నాలుగు పదాలు నా సంతృప్తి కోసమే...

No comments:
Post a Comment