అయితే నా అభిరుచిని మహిత రూపంలో నెరవేర్చుకోవాలనుకున్నా. అందుకు తగినట్లే తన స్వరం చాలా బాగుంటుంది. తనకు సంగీతం నేర్పించినా, ఎందుకో తను అంత ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మరో ఆశ శ్రీహిత రూపంలో చిగురించింది. తనైనా నా కలలకు కళారూపం ఇస్తుందేమో చూడాలి.
ఈ అసందర్భ ఉపోద్ఘాతం ఏమిటనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నా.
శ్రీహిత... అదే నా మనుమరాలు... పియానో ఎంత చక్కగా వాయించిందనీ... చూడ్డానికి నా రెండు కళ్లూ చాలలేదనుకోండి. తనలా ఎంచక్కా పియానో ప్లే చేస్తోంటే... కొత్తగా రెక్కలొచ్చెనా.. నీటిలోని చేప పిల్లకూ...అని ఓ కవి అన్నట్టుగా తనలో నన్ను నేనే చూసుకుంటూ ఉప్పొంగిపోయాననుకోండీ... అందుకే నా ఆనందాన్ని మీతోనూ పంచుకోవాలనిపించింది మరీ. ఎంతైనా అసలుకంటే వడ్డీ ముద్దు కదా..!
No comments:
Post a Comment