ఈతరం యువతకు హత్తుకునే కథతో ఇద్దరు ప్రేమికులు వివాహంలోని నిజమైన అర్థాన్ని కనుగొనే ప్రయత్నం ఈ సినిమా.
మరోసారి ఈ సినిమాలో భావోద్వేగాలను సునిశితంగా స్పృశించారు. ఒక సాధారణమైన కథను తీసుకొని... సమకాలీన సమస్యలను, కుటుంబంలోని వ్యక్తుల మధ్య వుండే మనోభావాలను మేళవించి చక్కని కథను
అల్లుకున్నారు. సున్నితమైన రొమాంటిక్ సన్నివేశాలు, అందమైన దృశ్యాలు, చక్కని హాస్యం, ఆహ్లాదకరమైన సంగీతంతో పాటు తనదైన శైలిలో మంచి సందేశాన్ని కూడా జోడించారు.
ఈ చిత్రంలోని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఆలోచింప చేసేవిగా వున్నాయి. మరో
సానుకూల అంశమేమిటంటే... సంగీతం. సంగీత దర్శకులు కళ్యాణి కోడూరి ఈ సినిమా
మూడ్ ను మరికాస్త పెంచేవిధంగా చక్కని సంగీతాన్ని అందించారు. నేపథ్య సంగీతం,
పెండ్లి పాట కళ్యాణి కోడూరి సమకూర్చిన సంగీతానికి హైలైట్ అని చెప్పొచ్చు.
నాగశౌర్య, మాళవికా నాయర్ తమతమ పాత్రలలో చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా హీరోయిన్ మాళవిక తన కళ్లతోనే అద్భుతమైన భావాలను పలించింది. కీలకమైన సన్నివేశాల్లో ఆమె కళ్లతో పలికించే భావాలను దర్శకురాలు చక్కగా తెరకెక్కించగలిగారు. కుటుంబం అంతా కలిసి ఎంచక్కా చూడదగిన మంచి ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రం ఇది.

No comments:
Post a Comment