
అప్పుడే పుట్టిన తనను
నర్సు చేతుల్లోని అందుకుని ఎంత మురిసిపోయాననీ...
పాలుగారే బుగ్గలతో...
నల్లని ఒత్తైన నొక్కుల జుత్తుతో ఎంత ముద్దుగా వుందనీ...
తననలా హృదయానికి హత్తుకొన్న తన్మయత్వం.. అనుభూతి వర్ణించడం
ఏ కవికీ సాధ్యంగాదేమో..
ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్లలో మెదులుతుంటే..
మనసులో వెల్లువెత్తే అనుభూతి ఆనంద భాష్ఫాలుగా మారుతుంటాయి..
కళకళలాడే ఆ కళ్లు..
కిలకిల నవ్వే ఆ ముద్దుల మోము
గల్లుగల్లు మంటూ మా నట్టింట నడయాడే తన అడుగుల సవ్వడి
మాకెప్పుడూ దీపావళి పండుగే..
నా చిట్టి తల్లీ...
ఏటేటా ఇలాగే అనేక పుట్టినరోజులు జరుపుకోవాలి
ఆట పాటలలో...చదువుసంధ్యలలో.. మేటిగ నిలవాలి
మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి.
మా ఊహలను నిజం చేస్తూ ఎన్నెన్నో ఎత్తులకెదగాలి..
నీ భవిష్యత్తు పూలనావలా ముందుకు సాగాలి..
అది చూస్తూ.. మేమంతా మురిసిపోవాలి
బంగారూ...నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
No comments:
Post a Comment