Social Icons

Monday, June 27, 2016

నా మనసుతో ‘ఒక మనసు’

‘ఒక మనసు’ సినిమా రివ్యూ

ప్రేమ... ఎక్కడున్నామనదగ్గరే ఉన్నట్టుగా వుంటుంది... 
అన్నీ తానే అన్నట్టుగా వుంటుంది... ఓ అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంటుంది...
ఆ అనుభూతిని నిర్వచించడం ఒక సాహసం... ఒక తప్పస్సు..
ప్రేమ ఎంత గాఢంగా వుంటుందో.... అంతే సున్నితంగా వుంటుంది.
ప్రేమలో ఉన్న ఒక జంట ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం..
ఒకరినొకరు స్పృశించుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం..
దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టు... 
దగ్గరగా ఉన్నా దూరమౌతామేమో అనే ఆర్తితో ఒకరిలో ఒకరు అన్నట్టుగా కలిసిపోవడం...
ఇది ఒక ఆర్తి.. ఒక అనుభూతి... ఒక అనుభవం...
ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమను.. అనుభూతిని... వర్ణించడం పుస్తకాల్లో చదవడానికి బాగానే వుంటుంది.
అదే అనుభూతిని వెండితెరపై ఆవిష్కరించాలంటే... 

ఆ ప్రేమలోని ఆర్తిని... గాఢతను.. అనుభూతిని ముందుగా దర్శకుడు అనుభవించాలి..
తర్వాత... నాయికా నాయకులు అనుభూతి చెందాలి.
తెరపై చూసేది కల్పితం కాదు... ఓ సజీవ దృశ్యం అన్నట్టుగా ప్రేక్షకుడ్ని మైమరపించాలి..
ఆ గాఢతను... అనుభూతిని ఓ యజ్ఞంగా సెల్యూలాయిడ్ పైకి ఎక్కించాలి.
ఈ మొత్తం ప్రక్రియలో పాలుపంచుకొనే 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడ చిన్న లోపం జరిగినా..
అది చంద్రునిపై మచ్చలా... ‘ఒక మనస్సు’ సినిమాలా తయారవుతుంది.
'ఒక మనసు' పేరు వినగానే ఇదో ప్రేమకథ అని తెలిసిపోతూనే వుంది. 
'మల్లెల తీరంలో సిరిమల్లెచెట్టు'తో దర్శకుడిగా పరిచయమైన రామరాజు దీనికి దర్శకుడు కావడం, 
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక రావడం ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. 
ఈ ప్రేమకథను కూడా ఒక కావ్యంలా మలుస్తాడని అంతా ఊహించారు. 
దర్శకుడి ప్రయత్నం కొంత మేర సఫలీకృతమైనా... ఒక ప్రేమకావ్యంగా మాత్రం రూపొందలేదు.
ఇక కథలో వెళితే... సూర్య (నాగశౌర్య) తండ్రి రావు రమేష్‌ అండతో సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తుంటాడు. 
కొడుకును ఎమ్మెల్యే చేయాలనేది కోరిక. అలాంటి సూర్య జీవితంలో మెడిసిన్‌ చదివే సంధ్య (నిహారిక) ప్రవేశిస్తుంది. 
తొలి చూపులోనే సూర్యను ఇష్టపడుతుంది. ఏదో జన్మలోని బంధమనే నమ్మకాన్ని ఏర్పరచుకుంటుంది. సూర్య చేసేది 
నచ్చకపోయినా.. అతన్ని ఇష్టపడుతూనే ఉంటుంది. తనను విడిచి ఒక్క క్షణం కూడా గడపలేని స్థితికి వచ్చేస్తుంది. 
అదే సమయంలో.. ఓ గొడవ వల్ల సూర్య జైలుకెళ్ళి బెయిల్‌పై తిరిగొస్తాడు. అయినా అతన్నే ఇష్టపడుతుంది. తల్లిని 
ఒప్పించి మరీ అతనితో ఉంటుంది. ఆ తర్వాత సూర్య జీవితంలోని అనూహ్య పరిణామాలతో సంధ్య దూరంగా వెళ్లాల్సిన 
పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుందనేది కథ.
అయితే.. కొన్ని సన్నివేశాల్లో సూర్య, సంధ్య మధ్య ఉండాల్సినంత దగ్గరతనం లేకపోవడం, వారి మధ్య ఏదో 
సంశయం అడ్డుతెరగా ఉందనిపిస్తుంది. కేవలం వీరిద్దరి పాత్రలే సినిమా అంతా కనిపిస్తాయి. మధ్యమధ్యలో కొన్ని 
పాత్రలు వస్తూ పోతుంటాయి. కథనం మొత్తం చాలా నెమ్మదిగా సాగుంది. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథలను 
ప్రేక్షకులు ఆస్వాదించాలంటే... వారి మనసును తాకాలి. ఆ పాత్రల్లో ప్రేక్షకుడు లీనమవ్వాలి. ఈ సినిమాలో ప్రధాన 
లోపం అదే. ముఖ్యంగా ఇటువంటి సినిమాలకు 
నేపథ్య సంగీతం ప్రాణం. ఈ సినిమాలో అదే పెద్ద లోపం. పాటలు సాహిత్య పరంగా బాగున్నా... సంగీతం 
ఆకట్టుకోలేదు.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే... ప్రస్తుతమున్న యువ హీరోల్లో నాగశౌర్య ఫర్వాలేదు. ఈ 
సినిమాలో మాత్రం అతని నటన ఇంతకుముందు సినిమాలకంటే భిన్నంగా.. పరిపక్వతతో కనిపిస్తుంది. ఒక రకంగా 
ఈ సినిమాను నిలబెట్టింది కూడా అతని నటనే. పాత్రను అర్థం చేసుకుని నటించాడు. సంధ్య పాత్రలోని పరిపూర్ణత 
నిహారిక నటనలో కనిపించలేదు. నిహారిక తన పరిధి మేరకు నిజాయితీగానే చేసినా.. కీలకమైన సన్నివేశాల్లో తన 
నటన నిరుత్సాహపరుస్తుంది. తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా అంత ఆకర్షణీయంగా లేదు. చీరలను కట్టడం వరకూ బాగానే 
వుంది. అందులో నేటి ఆధునికతను కూడా కాస్త మేళవిస్తే బాగుండేది. తన కాస్ట్యూమ్స్ ఎంపిక చేసిన వారి లోపమే 
అది. ఇక రావు రమేష్ గురించి కొత్తగా చెప్పడానికేముంది. ఏ పాత్ర అయినా పరకాయప్రవేశం చేస్తాడు. 
హీరోయిన తల్లి పాత్రలో ప్రగతి అంతగా నప్పలేదు.
మొత్తానికి ఈ సినిమా ఊహించినంత గొప్పగా.. ట్రైలర్స్ లో చూపినంత అద్భుతంగా లేకపోయినా... ప్రేమ 
అమరమని... ఎప్పటికీ చావనంత ప్రేమ ఒకటుంటుందని నేటి తరానికి గుర్తు చేశాడు దర్శకుడు.

No comments:

Post a Comment

Comments system

 

Sample text

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.

The Story of Art

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Curabitur quam augue, vehicula quis, tincidunt vel, varius vitae, nulla. Sed convallis orci. Duis libero orci, pretium a, convallis quis, pellentesque a, dolor. Curabitur vitae nisi non dolor vestibulum consequat.
Proin vestibulum. Ut ligula. Nullam sed dolor id odio volutpat pulvinar.
 
Blogger Templates