పల్లె ప్రాంతాల్లో, పొలాల్లో కనిపించే ఈ పక్షుల గూళ్లు...
చూడటానికి ఎంతో ముద్దుగా వుంటాయి.
చిన్నచిన్న పిచ్చుకలు వీటిని అత్యంత చాకచక్యంతో నిర్మించుకుంటాయి.
ఇవి గూడు కట్టుకోవడం చూస్తే.. ఎంతో ఆశ్చర్యంగా, అబ్బురంగా వుంటుంది.
చెయ్యి తిరిగి శిల్పి అద్భుతమైన శిల్పాన్ని చెక్కినంత సులభంగా...
అందంగా... ఈ పక్షులు తమ గూళ్లు కట్టుకుంటాయి...
చిన్నచిన్న గడ్డి పరకలను పోగేసుకొచ్చి గూడును అల్లుతుంటే...
అలా చూస్తూనే వుండాలనిపిస్తుంది.
అటువంటిది... ఇప్పుడు పల్లెల్లో కూడా గూళ్లూ కనిపించడంలేదు...
పిచ్చుకలూ కనిపించడంలేదు....వాటి కిచకిచలూ వినిపించడంలేదు.
పట్టణాలతో పాటు పల్లెల్లోనూ చెట్లను నరికివేస్తుండటం ఒక కారణమైతే...
అధిక టెక్నాలజీ తెచ్చిన ముప్పు మరో కారణం.
టవర్స్ నుండి వెలువుడుతున్న రేడియేషన్ వల్ల చిన్నచిన్న పక్షులు అంతరించిపోతున్నాయి.
నగరాలు కాంక్రీట్ జంగిల్స్ గారు మారుతున్న నేపథ్యంలో..
ఇది పర్యావరణానికి అతి పెద్ద ముప్పు.
పల్లెల్లోనూ, పట్టణాలలోనూ చెట్లను విరివిగా పెంచుకోవడం ద్వారా
పర్యావరణాన్ని కాపాడుకుందాం... మానవాళిని రక్షించుకుందాం...
నెట్ చూస్తోంటే... ఓ వెబ్ సైట్ లో ఈ ఫొటో కనిపించింది.
అంతే... మనసు చిన్నతనంలోకి ఉరకలు వేసింది.
ఈ ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ కి కూడా అభినందనలు చెప్పాలి.
చాలా రోజుల తర్వాత ఈ పోస్టుతో మళ్లీ మీ ముందుకు...

No comments:
Post a Comment