ఆమె కథలు..
జీవితానికి అద్దిన పరిమళాలు
స్త్రీల ఆకాంక్షలకు నిర్వచనాలు
‘ఇల్లలకగానే పండగ కాదు’అంటూ ఉద్బోధించే జీవనసత్యాలు
ప్రతి కథలోనూ కనిపించే స్త్రీ కోణం..
పురుషుల నీడలుగా మిగిలిపోతున్న స్త్రీలను చక్కదిద్దే చైతన్యం
నివురుగప్పిన నిప్పులా వుండే కుటుంబ హింస స్వభావం
...ఇత్యాది అంశాలన్నింటినీ కథా వస్తువులుగా తీసుకొని..
తన చుట్టూ ఉన్న మనుషుల స్వభావాలను పాత్రలుగా మలుచుకొని
ఆమె సృష్టించే కథలు నెమ్మదిగా ఆలోచనలను రేపి..
మహాప్రవాహంలా వెంటబడతాయి.
స్త్రీల జీవితాలను తరచిచూసి,
వారి జీవితంలోని వేదనలను బలంగా వినిపించి,
తన రచనల ద్వారా స్త్రీల జీవిత ఆకాంక్షలకు బలమైన చేయూతనందించిన రచయిత్రి...
చాలా సాధారణంగా కనిపిస్తూ.. అసాధారణమైన రచనలు చేయడంలో ఆమె సవ్యసాచి..
తాను మరెవరో కాదు... ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారు.
ఈ రోజు (1940 జూన్ 2) వారి పుట్టిన రోజు.
గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించిన సత్యవతి... ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఆంగ్ల సాహిత్యం లో పట్టభద్రులు. విజయవాడ ఎస్.ఎ.ఎస్.కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను అధ్యయనం చేసిన సత్యవతిగారు సమాజ గమనాన్ని అంతకంటే నిశితంగా పరిశీలించారనడానికి ఆమె రాసిన కథలూ, వెలువరించిన కథాసంపుటాలూ, ఇంటర్వ్యూలే నిదర్శనాలు. 1970నుంచి కథారచన చేస్తూ తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
నేటి సమాజంలో స్త్రీలు పురుషుల నీడలుగా ఎలా మిగిలిపోతున్నారో... కుటుంబాల్లో భద్రత కోసం, ఉనికి కోసం, స్వేచ్ఛ కోసం మహిళలు ఎలా తమకంటూ ఒక జీవిత విధానాన్ని ఎంచుకున్నారో తన రచనల ద్వారా తెలుపిన స్త్రీవాద రచయిత్రి సత్యవతి గారు. ఉన్నత మధ్య తరగతి స్త్రీల సమస్యల్నే కాక శ్రామికవర్గ స్త్రీల ఆకాంక్షల్ని కథలుగా చేసిన సత్యవతిగారు... ప్రస్తుతం కృష్ణాతీరం విజయవాడ నుంచి మహిళల ఎజెండాను కథా సాహిత్యంలో ప్రస్ఫుటం చేస్తున్నారని చెప్పడానికి నాకొకింత గర్వంగానూ వుంది. స్త్రీ సమగ్ర జీవితాన్ని కథల ద్వారా సత్యవతి గారు ఆవిష్కరించినంతగా మరొకరికి సాధ్యం కాదేమో. ప్రతి కథలోనూ స్త్రీ కోణం కనిపిస్తుంది. ప్రతి అంశంలోనూ సమాజంలో స్త్రీ పట్ల వ్యక్తమౌతోన్న ద్వంద్వనీతిని ఎత్తిచూపుతారు. పురుషాధిక్య సమాజంలో నిర్దేశించిన స్త్రీ ధర్మాలు... స్త్రీలనెలా యంత్రాలుగా మారుస్తున్నాయో సామాన్య పాఠకులకు సైతం అర్ధమయ్యేలా సత్యవతిగారు తన కథల్లో రాస్తారు. ‘సూపర్ మామ్ సిండ్రోమ్’ కథే ఇందుకు ఉదాహరణ. ఇది ప్రతి మహిళా చదవాల్సిన కధ.
రాశిలో తక్కువైనా వాసిలో అమోఘమనిపించుకున్న ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి.సత్యవతి గారి సాహితీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే ఆమె వెలువరించిన కథా సంపుటాలను పరిశీలించాలి... అధ్యయనం చేయాలి. వారి గురించి ఇలా ఎన్ని పేజీలైనా రాయొచ్చు. వారి రచనా విన్యాసాన్ని అంచనా వేయడానికి మనకున్న గీటురాళ్లు ఏ మాత్రం సరిపోవు. కొండను అద్దంలో చూపినట్టుగా ఆ విదుషిణీమణి సారస్వత కృషిని వారి పుట్టినరోజు సందర్భంగా మిత్రులందరితో పంచుకునే చిన్న ప్రయత్నమే ఇది.
వారు మరిన్ని వసంతాలు తన రచనా విన్యాసాన్ని కొనసాగిస్తూ..
మహిళా పక్షపాతిగా.. చైతన్యస్రవంతిగా సత్యవతిగారు నిలవాలని కోరుకుంటూ...
వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
- అంజనీ యలమంచిలి

No comments:
Post a Comment