(ఈ లింక్ పై క్లిక్ చేయండి)
https://soundcloud.com/anjani-yalamanchili/2017-10-05-audio-00000007
మా అక్క డాక్టర్ భార్గవి గారి రాతకు నా మాటలు
నేనాయింట్లో కళ్లు తెరవకపోయినా,నావూహలు కళ్లు తెరిచింది అక్కడే మాఆటలు, పాటలు,సరదాలు,సంతోషాలు,దిగుళ్లూ ,దుఃఖాలూ యెన్నిటినో తల్లిలా కడుపులో దాచుకుంది మండించే వేసవులూ,వణికించే చలికాలాలూ,జల్లులతో తడిపే జడివానలూ యెన్నిటినుండో రక్షణ కవచంలా నిలిచి కాపాడింది వంటింటి తలుపు తీస్తే అమ్మ వంట చేస్తున్న వాసనల జ్ఞాపకాలు గుప్పున ముసురుతాయి ఆ పెద్ద హాలు తలుపులుతీస్తే జరిగిన పెళ్లిళ్లూ, పేరంటాలూ, పెట్టిన బొమ్మల కొలువులూ తలపుల్లోకొస్తాయి మామిడి పళ్లకాలంలోపెద్ద పెద్ద గంపల్లోంచి పళ్లు యేరి తీసి భాగాలుగా పంచుకుని తిన్నరుచి యింకా నాలిక మీదే వున్నట్టుంది చాలారోజులుగా తగాదా పడి మాట్లాడుకోకుండా వున్న వాళ్లంకూడా మామిడపళ్ల భాగాలపంపకంలో పడి తగాదాలు మరిచి మాటాడుకునేవాళ్లం రాత్రులను పగళ్లు చేసి మెడికల్ యెంట్రన్స్ కి చదివిందీ భావశబలతతో గీతాంజలిని తెలిగించినదీ యిక్కడే కదా మా ముందు వసారాలో నుంచుంటే యెన్ని ముచ్చట్లు మూగుతాయో 9,10క్లాసులు చదివేటపుడు చడీ చప్పుడు లేకుండా తెల్లవారుజామునే లేచి కరెంటుదీపాలున్నా సరేలాంతరుముందు కూచుని దీక్షగాచదవడానికీ నాకన్నా చిన్న పిల్లలందరినీ చేర్చి చదువు పేరుతో పెత్తనం చెలాయించడానికీ ముందువసారా అనువుగా దొరికెది అమ్మనీ, పెదనాన్ననీ ఆవలి తీరానికి సాగనంపింది ఈ వసారా సాక్షి గానే మా దక్షిణపు వసారా నిజానికి మా వేసవి విడిది ఒకవైపుమాలతీ మరోవైపు మధుమాలతీ సువాసనలతో అలరిస్తే ఆపక్కనే వున్న సన్నజాజి మాత్రం లోటు రానిస్తుందా వేసవి శెలవుల్లో అర్థరాత్రి వరకూ కూచుని ఆడిన కేరమ్స్ కీ అప్పుడప్పుడూ పెదనాన్న తెల్లవార్లూ మేలుకుని తన్మయంగా చదువుకుంటూ చెప్పిన కావ్యాల వర్ణనలకీ కొండగుర్తు ఈ వసారా వాల్మీకి విశిష్టతనీ, కాళిదాసు గొప్పదనాన్నీ,శ్రీశ్రీ వుద్రేకాన్నీతెలుసుకున్నదీ సత్యజిత్ రాయ్ నీ యంయస్ సుబ్బలక్ష్శినీ పరిచయం చేసుకున్నదీ యిక్కడే ఇక మా వీథరుగులు మా అమ్మ సామ్రాజ్యపు సింహాసనాలు టీవీలు ఠీవిగా నట్టింట్లో రాజ్యమేలక ముందు మాపక్కింటావిడతో యెదురింటావిడతోప్రతి రోజూ సాయంత్రం కొలువుదీరీ వూరి ముచ్చట్లన్నీ కలబోసుకునేది అలా వీథి తలుపు తీసి రోడ్డు మలుపుకేసి చూశామా కలువలు తామరలతో నిండిన చెరువు మీదనుండీవీచేగాలితో ప్రాణం లేచి వచ్చేది వాకిట్లో కొస్తే రకరకాల కష్టమయిన క్లిష్టమయిన చూడ చక్కని చుక్కలముగ్గులతో నిండిన మావాకిలిచుక్కలతో నిండిన ఆకాశంతో పోటీ పడేది సంక్రాంతి వస్తే సరే సరి గొబ్బెమ్మలతో తోతయారు మరి యిప్పుడో కాలం చేసిన మాయాజాలంతో యేకాకి గా మిగిలిన మాయిల్లు వయోభారంతో పండిన పెద్ద ముత్తయిదువులా వుంటుంది మనుషులు మరుగవుతారని తెలుసు కలిసాయనుకున్న మనసులు విడిపోవచ్చని వూహించవచ్చు కానీ మాజీవితాలకీ మాజ్ఞాపకాలకీ ప్రతీకయిన ఆత్మబంధువు మాయిల్లు కూడా ముసలిదవుతుందనీ దానినికూడా రూపురేఖలు లేకుండా చేసుకోవాలిసి వస్తుందనీ తెలియడం వొక వూహించని విషాదం