
సంపాదించుకోవాలి. తమ అస్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలి. స్త్రీల మధ్య పరస్పర సహకారం ఎలా ఉండాలనే విషయాలున్నాయని, ఈ భావాలు దేశమంతటా పంచుకునే అవకాశం ఈ అవార్డు ద్వారా రావడం ఆనందంగా ఉందని ఓల్గా గారు చెప్పండం మహిళల పట్ల ఆమెకున్న లోతైన అవగాహన, సునిశిత దృష్టికి నిదర్శనం. ‘స్త్రీలు రచన చేయడం అంటే ఈ సంస్కృతిపై తిరుగుబాటుగా నమ్మి రచనలు చేయడమే’ అని ఓ సందర్భంలో ఓల్గా గారు చెబుతారు. ఆ తిరుగుబాటు తత్వం ఆమె రచనలన్నింటిలోనూ ప్రతిఫలిస్తుంది. తెలుగు సాహిత్యంలో స్త్రీల దృక్కోణం నుంచి, స్త్రీవాద దృక్పథం నుంచి నిర్దిష్టంగా విమర్శ రాసిన వాళ్లలో ఓల్గాది విశిష్ట స్థానం. ఆమె విమర్శనా వ్యాసాలు చాలా వరకు ‘పలికించుకు మౌన మృదంగాలను’ అనే సంపుటంగా వెలువడింది. ఈ సంపుటిలో ఎక్కువ భాగం రచనలు కొడవంటిగంటి కుటుంబరావు, చలంల మీద రాయటం యాదృచ్ఛికం కాదు. తెలుగు సాహిత్యంలో ఒక రకంగా ఈ యిద్దరు రచయితలు స్త్రీ సమస్యలను, స్త్రీల స్థితిగతుల్ని గురించి లోతుగా చర్చించారు. గత ఏడెనిమిది దశాబ్దాల తెలుగు సాహిత్యంలో వీళ్లిద్దరిదే సింహభాగం. అందుకే ఓల్గా వ్యాసాలు వీళ్లిద్దరిపై వుండటం అసంబద్ధమేమీ కాదు. ఏదేమైనా తెలుగులో స్త్రీవాద దృక్పథంపై సోదాహరణంగా తన రచనా వ్యాసంగం కొనసాగిస్తోన్న ఓల్గా గారూ మరిన్ని అవార్డులు గెలుచుకోవడంతో పాటు... తెలుగు సాహిత్యానికి మరిన్ని ఆణిముత్యాలను అందించాలని కోరుతూ... మరోసారి అభినందనలు.
No comments:
Post a Comment