కనుమరుగవుతోంది.. ఆధునిక సంస్కృతి ప్రజల అభిరుచుల్ని మార్చుతోంది. ఉత్సవాలు ఏవైనా... చిన్నా పెద్దా అందరినీ అలరించే ఇలాంటి తెలుగు సంస్కృతి ఇప్పుడు మాయమవుతోంది... అలాంటిది... గతాన్ని గుర్తుచేస్తూ...తిరునాళ్లలో సందడిచేస్తూ... మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను ఓపరి నెమరువేసుకునే ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది ఆ పల్లెలో... అదే పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని.... ఉండ్రాజవరం. అచ్చమైన పల్లె సొగసులు
ఉండ్రాజవరం సొంతం. మండువా లోగిళ్లు, దేవాలయాలు, పచ్చని తోరణాలు పరిచినట్లుగా ఊరంతా కొబ్బరితోటలు... పచ్చదనాన్నంతా రంగరించి ప్రకృతి కాన్వస్ పై రంగులద్దినంత అందమైన ఊరు ఉండ్రాజవరం. ఇది నా స్నేహితురాలు శాంతి స్వగ్రామం. సుబ్రమణ్యేశ్వర షష్టి సందర్భంగా తనతో కలిసి అక్కడి దేవాలయాన్ని దర్శించాం. గత వైభవానికి సాక్షిగా అందమైన శిల్పకళతో మనసుకు హత్తుకునేలా వున్న దేవాలయం. దానికి ఇరువైపులా రకరకాల వస్తువులతో అనేక అంగళ్లు.. బొమ్మల దుకాణాలు, తినుబండారాలు.. ఈ దృశ్యం మళ్లీ బాల్య స్మృతులను ఒక్కసారిగా కళ్లముందు ఆవిష్కరించింది. పావలాతో కొన్న కళ్లజోడు, రూపాయితో కొన్న కారు బొమ్మ, ఐదు పైసలుతో కొన్న జీళ్లు... ఇలా ఒక్కటేమిటీ.. అనేకం...
మన సంస్కృతిని ఇంకా నిలిపివుంచిన ఉండ్రాజవరం లాంటి పల్లెలు అనేకం ఈ ప్రాంతంలో. నేను పొందిన అవ్యక్తానుభూతి... మీతో కొంతైన పంచుకోవాలనే తపనే.. ఈ నాలుగు అక్షరాలు...
No comments:
Post a Comment