ఉదయాన్నే కాఫీ కప్పుతో పాటు ఆంధ్రజ్యోతి పేపర్ అందుకున్నా...
అలా పేజీలు తిప్పుతోంటే... ఒక పేజీలో సునీత... చిరునవ్వుతో.. కాస్తంత సిగ్గుపడుతూ... బాపు బొమ్మలా ముద్దుముద్దుగా కనిపించింది సునీత ఫొటో. తన ఇంటర్వ్యూ కూడా. గబగబా చదివేశాను. ఈలోపు తెచ్చుకున్నా కాఫీ కాస్త చల్లారిపోయింది. మళ్లీ కాఫీ తెచ్చుకునేందుకు వంటగదిలోకి వెళ్లినా సునీత నవ్వుల గలగలలే వినిపిస్తున్నాయి...
సునీత....
సాంప్రదాయం... ఆత్మవిశ్వాసం... ఆత్మగౌరవం... మరికాస్త ఆధునికత కలబోసిన తెలుగింటి ముద్దుగుమ్మ... మధురగాయని సునీత. సంగీతం, సాహిత్యం, నాట్యం, యాంకరింగ్, డబ్బింగ్ వంటి అనేక కళలో ప్రవేశమున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. తనలో నిండైన ఆత్మవిశ్వాసం... హుందాతనం తొణికిసలాడుతుంటుంది. అన్నిటికీ మించి నాకు మంచి స్నేహితురాలు. తనలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం. ఉదయాన్నే సునీత ఆలోచనలు నాలో మంచి ఉత్సాహాన్ని నింపాయి. అందుకే నా ఉత్సాహాన్ని మీతోనూ పంచుకుంటున్నాను.
ఆ పత్రికలో ‘నేను చాలా ఎక్స్ క్లూజివ్’ అని శీర్షిక పెట్టినట్లుగానే... తను ఓ ప్రత్యేకమైన వ్యక్తి. సునీతగారు చేసే ప్రోగ్రామ్స్ కూడా మిగతావారికంటే తనలోని ప్రత్యేకతను చాటుకునేలా వుంటాయి. తను చేసే ప్రోగ్రామ్స్ లో ఎక్కువశాతం సంగీత ప్రాధాన్యం వున్నవే. ఝమ్మంది నాదం, సరిగమ, లిటిల్ సింగర్స్, స్వరాభిషేకం వంటి ప్రోగ్రామ్
సునీతగారి అభిరుచికి నిదర్శనం. నిజం చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు.. తనని చూడాలా... తన పాట వినాలా... తన డ్రెస్సింగ్ స్టైల్ చూడాలా అని తికమక అవుతుంటాను. ముఖ్యంగా తను పాట పాడేటప్పుడు ఆ పాటలో లీనమైపోయే తీరు, తన హావభావాలు మరీ ముద్దొస్తాయంటే అతిశయోక్తికాదు. పాటలో తను తన్మయత్వం
చెందుతుంది. సునీత పాట అంటే పడిచచ్చిపోయేవాళ్లు ఎందరో.. వారిలో నేనూ వున్నాననుకోండి.
అంతేకాదు... సునీతగారిలో మరో ప్రత్యేకత కల్మషంలేని తన చిరునవ్వు. తను గలగల నవ్వుతుంటే... గోదావరి పరవళ్లు తొక్కినట్టుగా మనసుని రంజింపచేస్తుంది. ఇక సునీతగారి డ్రెస్సింగ్ స్టైల్ అయితే సూపర్బ్ గా వుంటుంది. తన చీరలను నా ఫ్రెండ్ చంద్రిక డిజైన్ చేస్తుంది. వాటి అమరిక సునీతకు ఎంత బాగుంటాయంటే... ఆ చీర కట్టడం వల్ల సునీతకు అందం వచ్చిందా.... లేక సునీత కట్టడంవల్ల ఆ చీరకే అందం వచ్చిందా అన్నంత ఆకర్షణీయంగా వుంటుంది. ఓ పాట కూడా గుర్తొస్తోంది... ‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా... ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మా...’ అని. సునీత గారి విషయంలో ఇది అక్షరాలా నిజం. మాటల్లో నవనీతం... గానంలో సుమధుర పరిమళం... ఎంత ఎదిగినా ఒదిగివుండే వినయం ఆమె సొంతం. అందుకే సునీత గారంటే నాకు చాలా ఇష్టం... తన గురించిన మరికొన్ని ముచ్చట్లతో మరోసారి కలుద్దాం....సరేనా..

No comments:
Post a Comment